Pamchadaara bommaa bommaa...

పంచదార బొమ్మా బొమ్మా...
Work
Year
Language

పల్లవి:

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మ
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆఆ... ఆఆ... ఆఆ... ఆఆ... ఆ...

చరణం 1:

పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే

నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట
అంటుకుంటే మంటే ఒళ్ళంతా

తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపుతీగ నువ్వని పంపిందే

మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట
వరదంట ఈ వరదలాగా మారితే ముప్పంట

వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆఆ... ఆఆ... ఆఆ... ఆఆ... ఆ...

చరణం 2:

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా?

గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప?

వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైనా?

వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేలా?

అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆఆ... ఆఆ... ఆఆ... ఆ... ఆ

pallavi:

paṁchadāra bŏmmā bŏmmā paṭṭugovaddanagammā
maṁchubūla kŏmmā kŏmmā muṭṭugovaddanagammā
sedine tāgŏddaṁṭe sĕṁtage rāvaddaṁṭe emavudānammā
ninu pŏṁdeḍaṁduge puṭṭāne gummā
nuvu aṁdagabode vṛdhā ī janma
ninu pŏṁdeḍaṁduge puṭṭāne gummā
nuvu aṁdagabode vṛdhā ī janma āā... āā... āā... āā... ā...

saraṇaṁ 1:

puvvu paina sĕyyeste kasiri nannu tiṭṭiṁde
pasiḍi puvvu nuvvani paṁpiṁde

nuvvu rāgu nā vĕṁṭa ī puvvu suṭṭu muḽḽaṁṭa
aṁṭuguṁṭe maṁṭe ŏḽḽaṁtā

tīga paina sĕyyeste tiṭṭi nannu nĕṭṭiṁde
mĕrubudīga nuvvani paṁpiṁde

mĕrubu vĕṁṭa urumaṁṭa urumu vĕṁṭa
varadaṁṭa ī varadalāgā māride muppaṁṭa

varadainā varamani varistānammā
munagainā sukhamani muḍestānammā
ninu pŏṁdeḍaṁduge puṭṭāne gummā
nuvu aṁdagabode vṛdhā ī janma āā... āā... āā... āā... ā...

saraṇaṁ 2:

gāli ninnu tāgiṁdi nela ninnu tāgiṁdi
nenu ninnu tāgide tappā?

gāli ūbirayyiṁdi nela nannu naḍibiṁdi
emiḍaṁṭa nīloni gŏppa?

vĕlugu ninnu tāgiṁdi sinugu kūḍa tāgiṁdi
pakṣhabādamĕṁdugu nābainā?

vĕlugu dāri sūbiṁdi sinugu lāla posiṁdi
vāḍidoḍi poliga nīgelā?

avi bradigunnappuḍe toḍuṁṭāyammā
nī sidilo toḍai nenŏstānammā
ninu pŏṁdeḍaṁduge puṭṭāne gummā
nuvu aṁdagabode vṛdhā ī janma āā... āā... āā... ā... ā