కంటిలేవే నీ సుద్దు లిక్కడ నమ్మతోఁ జెప్పేను
(॥పల్లవి॥)
కంటిలేవే నీ సుద్దు లిక్కడ నమ్మతోఁ జెప్పేను
వెంట వచ్చినదానను వెస నన్నెఱఁగవా
(॥కంటి॥)
యెడమాఁట లాడవచ్చి యేల సిగ్గులు వడేవే
నడుమ నూరక యేల నవ్వు నవ్వేవే
చిడుమూడి నటనతో శిరసు వంచనేఁటికే
తొడరి పొందులు సేసే దూతికవు నీవు
(॥కంటి॥)
చన్నులమీఁది పయ్యెద జారనేల తోసేవే
సన్నలనే మోవితేనె చల్లనేఁటికే
కన్ను లారుచుకొంటాను కతలేమి చెప్పేవే
పన్నిన రాయభారపు పడఁతివి నీవు
(॥కంటి॥)
నిలుచుండి నీకు నీకే నివ్వెరగులే లయ్యేవే
చెలరేఁగి మేనేల చెమరించేవే
అలమేలుమంగ నేలె నప్పడే శ్రీ వేంకటేశుఁ -
డెలమిఁ జెలికత్తెవు మేలంటి వే(టే?) నీవు
(||pallavi||)
kaṁṭileve nī suddu likkaḍa nammadom̐ jĕppenu
vĕṁṭa vachchinadānanu vĕsa nannĕṟam̐gavā
(||kaṁṭi||)
yĕḍamām̐ṭa lāḍavachchi yela siggulu vaḍeve
naḍuma nūraga yela navvu navveve
siḍumūḍi naḍanado śhirasu vaṁchanem̐ṭige
tŏḍari pŏṁdulu sese dūdigavu nīvu
(||kaṁṭi||)
sannulamīm̐di payyĕda jāranela toseve
sannalane movidenĕ sallanem̐ṭige
kannu lārusugŏṁṭānu kadalemi sĕppeve
pannina rāyabhārabu paḍam̐tivi nīvu
(||kaṁṭi||)
nilusuṁḍi nīgu nīge nivvĕragule layyeve
sĕlarem̐gi menela sĕmariṁcheve
alamelumaṁga nelĕ nappaḍe śhrī veṁkaḍeśhum̐ -
ḍĕlamim̐ jĕligattĕvu melaṁṭi ve(ṭe?) nīvu