Title (Indic)కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉ WorkGorintaku Year1979 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం చరణం 1: మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం చరణం 2: కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం Englishpallavi: kŏmma kŏmmago sannāyi koḍi rāgālu unnāyi emiḍī maunaṁ ĕṁdugī dhyānaṁ emiḍī maunaṁ ĕṁdugī dhyānaṁ kŏmma kŏmmago sannāyi koḍi rāgālu unnāyi manasulo dhyānaṁ māḍalo maunaṁ manasulo dhyānaṁ māḍalo maunaṁ saraṇaṁ 1: manasumāḍagaṁdani nāḍu madhuramaina pāḍavuduṁdi madhuramaina vedanalone pāḍagu pallavi puḍuduṁdi manasumāḍagaṁdani nāḍu madhuramaina pāḍavuduṁdi madhuramaina vedanalone pāḍagu pallavi puḍuduṁdi pallaviṁchu paḍusudanaṁ parusugunna mamadalu sūḍu pallaviṁchu paḍusudanaṁ parusugunna mamadalu sūḍu pasidanāla tŏliveguvūlo musurugunna mabbulu sūḍu aṁduge dhyānaṁ aṁduge maunaṁaṁduge dhyānaṁ aṁduge maunaṁ saraṇaṁ 2: kŏṁṭĕvayasu korigalāgā godāri uragalu sūdu uragalega ūgisalāḍe paḍavagunna baṁdhaṁ sūḍu kŏṁṭĕvayasu korigalāgā godāri uragalu sūdu uragalega ūgisalāḍe paḍavagunna baṁdhaṁ sūḍu ŏḍḍudono nīḍidono paḍava muḍibaḍi uṁḍāli ŏḍḍudono nīḍidono paḍava muḍibaḍi uṁḍāli ĕppuḍe muḍi ĕvarido paḍi paḍava payanaṁ sāguno mari aṁduge dhyānaṁ aṁduge maunaṁaṁduge dhyānaṁ aṁduge maunaṁ