పల్లవి:
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు (2)
చరణం 1:
కరి మబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు (కరి మబ్బులు)
మతి తప్పిన కాకుల రొదలో..మౌనమే వెలుగు (2)
దహియించే బాధల మధ్యన..సహనమే వెలుగు
చరణం 2:
కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి (2)
నీళ్ళు లేని ఎడారిలో..కన్నీళ్ళైనా తాగి బ్రతకాలి
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు (2)
జగమంత దగా చేసిన..చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ..జగమంత వెలుగు
pallavi:
goraṁta dībaṁ kŏṁḍaṁta vĕlugu
siguraṁta āśha jagamaṁta vĕlugu (2)
saraṇaṁ 1:
kari mabbulu kamme veḽa..mĕrubu tīge vĕlugu
kāru sīgaḍi musire veḽa..vegu sukke vĕlugu (kari mabbulu)
madi tappina kāgula rŏdalo..mauname vĕlugu (2)
dahiyiṁche bādhala madhyana..sahaname vĕlugu
saraṇaṁ 2:
kaḍali naḍuma paḍava munigide..kaḍadāgā īdāli (2)
nīḽḽu leni ĕḍārilo..kannīḽḽainā tāgi bradagāli
e toḍu leni nāḍu nī nīḍe nīgu toḍu (2)
jagamaṁta dagā sesina..siguraṁta āśhanu sūḍu
siguraṁta āśha..jagamaṁta vĕlugu