Ghallu ghalluna kaali gajjelu mrogamga..

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..
Year
Language

పల్లవి:

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
సింగారమొలకంగ చీర కొంగులు జారే రంగైన నవమోహనాంగీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ !!ఘల్లు ఘల్లున!!

చరణం 1:

అందాల గంధాలు పూసేయనా... సింధూర కుసుమాలు సిగ ముడవనా...!!2!!

చిలకమ్మో... కులికి పలుకమ్మో
ఆ... చిలకమ్మో.. కులికి పలుకమ్మో
నిలువెత్తు నిచ్చెన్లు నిలవేయనా... నీ కళ్ళ నెలవళ్ళ నీడంచనా

మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో !!2!!

పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
దొంతు మల్లెల మీద దొర్లించనా

అలివేణీ అలకల్లే.. నెలరాణి కులుకల్లే.. తరలెల్లి పోకమ్మా కలికీ !
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ !!ఘల్లు ఘల్లున!!

చరణం 2:

గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా !!2!!

నెలవంకా.. చూడు నా వంక
చిట్టి నెలవంకా... చూడు నా వంక
నీ మేని హొయలన్నీ బులిపించనా.. ఎలమావి కోకేసి కొలువుంచనా

పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో
పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో

నట్టింట దీపాన్ని నడికొండ కెక్కించి
చీకట్ల వాకిట్లో చిందేయనా

పొగరంతా ఎగరేసి.. వగలన్నీ ఒలకేసి.. కవ్వించబోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోమెందుకే కోమలాంగీ.. రాణీ !!ఘల్లు ఘల్లున!!

pallavi:

ghallu ghalluna kāli gajjĕlu mrogaṁga... kalahaṁsa naḍagala kaligi
siṁgāramŏlagaṁga sīra kŏṁgulu jāre raṁgaina navamohanāṁgī
īḍū joḍū managu iṁpuga kudiriṁdi kobamĕṁduge komalāṁgī... rāṇī !!ghallu ghalluna!!

saraṇaṁ 1:

aṁdāla gaṁdhālu pūseyanā... siṁdhūra kusumālu siga muḍavanā...!!2!!

silagammo... kuligi palugammo
ā... silagammo.. kuligi palugammo
niluvĕttu nichchĕnlu nilaveyanā... nī kaḽḽa nĕlavaḽḽa nīḍaṁchanā

maḍadallo.. meni muḍadallo.. muchchaṭlo.. sīra kuchchiṭlo !!2!!

pasubu pārāṇesi.. paṭṭĕ maṁchaṁ vesi
pasubu pārāṇesi.. paṭṭĕ maṁchaṁ vesi
dŏṁtu mallĕla mīda dŏrliṁchanā

aliveṇī alagalle.. nĕlarāṇi kulugalle.. taralĕlli pogammā kaligī !
īḍū joḍū managu iṁpuga kudiriṁdi kobamĕṁduge komalāṁgī... rāṇī !!ghallu ghalluna!!

saraṇaṁ 2:

gaganāla sigabūla parubeyanā... pannīḍi vĕnnĕllo muṁcheyanā !!2!!

nĕlavaṁkā.. sūḍu nā vaṁka
siṭṭi nĕlavaṁkā... sūḍu nā vaṁka
nī meni hŏyalannī bulibiṁchanā.. ĕlamāvi kogesi kŏluvuṁchanā

pŏddullo... saṁdabŏddullo.. niddaṭlo.. muddu muchchaṭlo
pŏddullo... saṁdabŏddullo.. niddaṭlo.. muddu muchchaṭlo

naṭṭiṁṭa dībānni naḍigŏṁḍa kĕkkiṁchi
sīgaṭla vāgiṭlo siṁdeyanā

pŏgaraṁtā ĕgaresi.. vagalannī ŏlagesi.. kavviṁchabogammā kaligī
īḍū joḍū managu iṁpuga kudiriṁdi komĕṁduge komalāṁgī.. rāṇī !!ghallu ghalluna!!