Gajje ghallu mamtumte

గజ్జె ఘల్లు మంటుంటే
Year
Language

పల్లవి:

ఝణన ఝణన నాదంలో ఝుళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది
గజ్జె ఘల్లు మంటుంటే... గుండె ఝల్లు మంటుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే...కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లు మంటుంటే కవిత వెల్లువవుతుంది

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

చరణం 1:

అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి
అవి నీలో మిల మిల మెరిసే అరకన్నుల కలలైనాయి ||2||

నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి ||2||
నీ విరుపుల మెరుపులలో నీ పాదాల పారాణి

చరణం 2:

తుంగభద్ర తరంగాలలో సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది ||2||

అచ్చ తెలుగు నుడికారంలా మచ్చలేని మమకారంలా ||2||
వచ్చినదీ కవితా గానం నీ విచ్చిన ఆరవ ప్రాణం

pallavi:

jhaṇana jhaṇana nādaṁlo jhuḽibiṁchina pādaṁlo
jagamu jaladaristuṁdi pĕdavi palagaristuṁdi
gajjĕ ghallu maṁṭuṁṭe... guṁḍĕ jhallu maṁṭuṁdi
gajjĕ ghallu maṁṭuṁṭe guṁḍĕ jhallu maṁṭuṁdi
guṁḍĕ jhallu maṁṭuṁṭe...kavida vĕlluvavuduṁdi
guṁḍĕ jhallu maṁṭuṁṭe kavida vĕlluvavuduṁdi

gajjĕ ghallu maṁṭuṁṭe guṁḍĕ jhallu maṁṭuṁdi

saraṇaṁ 1:

amarāvadi śhilbaṁlo aṁdamaina kaḽalunnāyi
avi nīlo mila mila mĕrise aragannula kalalaināyi ||2||

nāgārjuna kŏṁḍa konalo nāṭyarāṇi kṛṣhṇaveṇi ||2||
nī virubula mĕrubulalo nī pādāla pārāṇi

saraṇaṁ 2:

tuṁgabhadra taraṁgālalo saṁgīdaṁ nīlo vuṁdi
raṁga raṁga vaibhavaṁgā pŏṁgi padaṁ pāḍistuṁdi ||2||

achcha tĕlugu nuḍigāraṁlā machchaleni mamagāraṁlā ||2||
vachchinadī kavidā gānaṁ nī vichchina ārava prāṇaṁ