ఎన్నఁడు నేరిచితివో ఇంతేసి కతలు
(॥పల్లవి॥)
ఎన్నఁడు నేరిచితివో ఇంతేసి కతలు
నిన్న మొన్నటిదానవు నిన్నెంచి చూచితేను
(॥ఎన్నఁ॥)
సడఁగులు చల్లి చల్లి చట్రాత నా రొలిచేవు
తడయక సిగ్గులనే దడి గట్టేవు
అడఁకువ నయాల బయలు వందిలి వెట్టేవు
బడినుండి రమణునిఁ బనిగొనఁ గలవే
(॥ఎన్నఁ॥)
యెలయింపు మాఁటలనే ఇసుకఁ దాడు వేఁడేవే
సొలపుఁజూపులనే సొక్కు చల్లేవు
సెలవుల నవ్వులనే జిగురుఁగండె లోడ్డేవు
యెలమి నీ విన్నిటాను యీడేరుఁగలవే
(॥ఎన్నఁ॥)
కతకారి తనాలనే గాలి మూటగట్టేవు
రతి యొయిలులేనివాన రప్పించేవు
యితఁడు శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్మంగను
చతురత నీవూఁ గొత సాదించఁగలవే
(||pallavi||)
ĕnnam̐ḍu nerisidivo iṁtesi kadalu
ninna mŏnnaḍidānavu ninnĕṁchi sūsidenu
(||ĕnnam̐||)
saḍam̐gulu salli salli saṭrāda nā rŏlisevu
taḍayaga siggulane daḍi gaṭṭevu
aḍam̐kuva nayāla bayalu vaṁdili vĕṭṭevu
baḍinuṁḍi ramaṇunim̐ banigŏnam̐ galave
(||ĕnnam̐||)
yĕlayiṁpu mām̐ṭalane isugam̐ dāḍu vem̐ḍeve
sŏlabum̐jūbulane sŏkku sallevu
sĕlavula navvulane jigurum̐gaṁḍĕ loḍḍevu
yĕlami nī vinniḍānu yīḍerum̐galave
(||ĕnnam̐||)
kadagāri tanālane gāli mūḍagaṭṭevu
radi yŏyilulenivāna rappiṁchevu
yidam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nalamelmaṁganu
sadurada nīvūm̐ gŏda sādiṁcham̐galave