(॥పల్లవి॥)
ఎంత నేరుపరి యీ లేమ
దొంతివెట్టే సంతోసముల
(॥ఎంత॥)
వెలఁది సెలవులను వెన్నెలగాసీ
చెలులు నీసుద్దులు చెప్పఁగను
తలపోఁతలనే దండలు గుచ్చీ
నెలకొని యెదుటను నీవుండగను
(॥ఎంత॥)
వనిత చెక్కులను వానలు గురిసీ
తనియని విరహపుఁ దమకమున
కనుచూపులనే కలువలు చల్లీ
నినుపుల వలపుల నీరాకలకు
(॥ఎంత॥)
తెఱవ పెదవులను తేనెలు చిందీ
మఱి నీవాడిన మాఁటలను
నెఱి శ్రీవేంకటనిలయ కూడితివి
జఱసీ నీతో జాణతనముల
(||pallavi||)
ĕṁta nerubari yī lema
dŏṁtivĕṭṭe saṁtosamula
(||ĕṁta||)
vĕlam̐di sĕlavulanu vĕnnĕlagāsī
sĕlulu nīsuddulu sĕppam̐ganu
talabom̐talane daṁḍalu guchchī
nĕlagŏni yĕduḍanu nīvuṁḍaganu
(||ĕṁta||)
vanida sĕkkulanu vānalu gurisī
taniyani virahabum̐ damagamuna
kanusūbulane kaluvalu sallī
ninubula valabula nīrāgalagu
(||ĕṁta||)
tĕṟava pĕdavulanu tenĕlu siṁdī
maṟi nīvāḍina mām̐ṭalanu
nĕṟi śhrīveṁkaḍanilaya kūḍidivi
jaṟasī nīdo jāṇadanamula