ఈ క్షణం...
పల్లవి:
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా || ఈ క్షణం ||
తరగని దూరములో ఓ... ఓ... ఓ... తెలియని దారులలో ఓ... ఓ... ఓ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా || ఈ క్షణం ||
చరణం 1:
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది ఆ... ఆ... ఆ...
మళ్ళి నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది
|| ఈ క్షణం ||
చరణం 2:
రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చజెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని ఆ... ఆ... ఆ...
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది
|| ఈ క్షణం ||
pallavi:
ī kṣhaṇaṁ ŏge ŏga koriga
nī svaraṁ vinālani tīyagā || ī kṣhaṇaṁ ||
taragani dūramulo o... o... o... tĕliyani dārulalo o... o... o...
ĕkkaḍunnāvu aṁṭoṁdi āśhagā || ī kṣhaṇaṁ ||
saraṇaṁ 1:
ĕnni vela nimiṣhālo lĕkkabĕṭṭuguṁṭoṁdi
ĕṁta sebu gaḍabālo sĕppavemi aṁṭoṁdi
ninnanega vĕḽḽāvanna saṁgadi gurdeleni guṁḍĕ idi ā... ā... ā...
maḽḽi ninnu sūsedāga nālo nannu uṁḍanīga ārāḍaṁga kŏṭṭugunnadi
|| ī kṣhaṇaṁ ||
saraṇaṁ 2:
rĕppaveyanaṁṭoṁdi ĕṁta pichchi manasu idi
rebu nuvvu rāgāne kāsta nachchajĕppu mari
ninna mŏnna sĕppugunna ūsule maḽḽi maḽḽi talasuguni ā... ā... ā...
iṁkā ĕnno unnāyaṁṭu ippuḍe sĕppālaṁṭu niddaronu aṁṭoṁdi
|| ī kṣhaṇaṁ ||