Brahmaa o brahmaa mahamuddugaa umdi gu

బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గు
Work
Year
Language

పల్లవి:

బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా (2)
జాబిల్లిలా ఉంది జాణ ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈరోజే చూసానుగా
బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా

చరణం 1:

నీలాల ఆ కళ్ళలో నీరెంత దాగున్నదో
ఆ లేడి కూనమ్మా ఈ వింత చూసుంటే ఏమంటదో
ఆ పాలచెక్కిళ్ళలో మందారమే పూచెనో
ఈ చోద్యమే చూసి అందాల గోరింక ఏమంటదో
నా గుండె దోసిల్లు నిండాయిలే నేడు ఆ నవ్వు ముత్యాలతో
ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో
బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా
బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా

చరణం 2:

నూరేళ్ళ ఈ జన్మని ఇచ్చింది నువ్వేనని
ఏ పూజలు రాని నేనంటే నీకెంత ప్రేముందనీ
ఈ వేళ ఈ హాయిని నా గుండెనే తాకని
అందాల ఆ రాణి కౌగిళ్ళలో వాలి జీవించనీ
ఆ పంచబూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగా దీవించని
తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని

pallavi:

brahmā o brahmā mahamuddugā uṁdi gummā
bŏmmā ī bŏmmā arĕ aṁdānige aṁdamā (2)
jābillilā uṁdi jāṇa ā navvu mīḍiṁdi vīṇa
eḍeḍu logālalo iṁta aṁdānni īroje sūsānugā
brahmā o brahmā mahamuddugā uṁdi gummā
bŏmmā ī bŏmmā arĕ aṁdānige aṁdamā

saraṇaṁ 1:

nīlāla ā kaḽḽalo nīrĕṁta dāgunnado
ā leḍi kūnammā ī viṁta sūsuṁṭe emaṁṭado
ā pālasĕkkiḽḽalo maṁdārame pūsĕno
ī sodyame sūsi aṁdāla goriṁka emaṁṭado
nā guṁḍĕ dosillu niṁḍāyile neḍu ā navvu mutyālado
ī jñābagālanni ne dāsuguṁṭānu premado
brahmā o brahmā mahamuddugā uṁdi gummā
bŏmmā ī bŏmmā arĕ aṁdānige aṁdamā

saraṇaṁ 2:

nūreḽḽa ī janmani ichchiṁdi nuvvenani
e pūjalu rāni nenaṁṭe nīgĕṁta premuṁdanī
ī veḽa ī hāyini nā guṁḍĕne tāgani
aṁdāla ā rāṇi kaugiḽḽalo vāli jīviṁchanī
ā paṁchabūdālu ŏkkŏkkaḍai vachchi sallaṁgā dīviṁchani
tana sĕṁtage seri e roju sĕppāli premani