Anuraaga devada neeve

అనురాగ దేవత నీవే
Year
Language

పల్లవి:

అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే
అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే

చరణం 1:

ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. ఎద చాలని మధురానందం..ఉ..
ఏనాటిదో ఈ అనుబంధం.. ఎద చాలని మధురానందం..ఊ..
నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం.. మమతానురాగ బంధం...

అనురాగ దేవత నీవే..ఏ...

చరణం 2:

నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే..
నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే...
నా దేవివై దీవించవే.. నా కోసమే జీవించు
నీ దివ్యసుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం.. మన సంగమం సంగీతం...

అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే..
అనురాగ దేవత నీవే..

pallavi:

anurāga devada nīve.. nā āmani pulagiṁta nīve
nā nīḍagā uṁdi nīve.. nī toḍugā uṁḍanīve.. uṁḍibove
anurāga devada nīve.. nā āmani pulagiṁta nīve
nā nīḍagā uṁdi nīve.. nī toḍugā uṁḍanīve.. uṁḍibove

saraṇaṁ 1:

enāḍido ī anubaṁdhaṁ...u..u.. ĕda sālani madhurānaṁdaṁ..u..
enāḍido ī anubaṁdhaṁ.. ĕda sālani madhurānaṁdaṁ..ū..
neneḍu janmalu ĕttide.. eḍeḍu janmalagu ĕdige baṁdhaṁ
idi vīḍarāni baṁdhaṁ.. mamadānurāga baṁdhaṁ...

anurāga devada nīve..e...

saraṇaṁ 2:

nanu nannugā premiṁchave.. nī pābagā lāliṁchave..
nanu nannugā premiṁchave.. nī pābagā lāliṁchave...
nā devivai dīviṁchave.. nā kosame jīviṁchu
nī divyasuṁdara rūbame.. nā guṁḍĕ guḍilo vĕlige dībaṁ
nā jīvidaṁ nī gīdaṁ.. mana saṁgamaṁ saṁgīdaṁ...

anurāga devada nīve.. nā āmani pulagiṁta nīve
nā nīḍagā uṁdi nīve.. nī toḍugā uṁḍanīve.. uṁḍibove..
anurāga devada nīve..