Title (Indic)యెట్టు చేసినాఁ జేయి యేమీ ననఁజాల నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యెట్టు చేసినాఁ జేయి యేమీ ననఁజాల నిన్ను ముట్టిన నా మతిలోను మోహము చెప్పితిని (॥॥) విరహాగ్నిఁ గాఁగి నిన్ను వెంగె మాడఁ దలఁతును కరఁగి యంతలో నాడక మానుదును విరుల యమ్ములు నాటి వేయఁ బూనుదు పూవుల పరగ నా మేలుగానే భావించి వూరకుందు (॥॥) తమక మాఁపఁగ లేక దాకొని జంకించిఁ జూతు మమత తో జంకించక మరి సొలతు వుమురు వెన్నెలకుఁగా కుహింతు నిన్నుఁబైకొన భ్రమసి నీవే నే నని భావించి వూరకుందు (॥॥) కోవిల కూతలకుఁగా కూచుందు నీ తొడమీఁద కావిరిఁ గూచుండ కటు కౌఁగిలింతును శ్రీ వేంకటేశ నన్నుఁ జేకొని కూడితి విట్టే భావము లొక్కటిగానే భావించి వూరకుందు English(||pallavi||) yĕṭṭu sesinām̐ jeyi yemī nanam̐jāla ninnu muṭṭina nā madilonu mohamu sĕppidini (||||) virahāgnim̐ gām̐gi ninnu vĕṁgĕ māḍam̐ dalam̐tunu karam̐gi yaṁtalo nāḍaga mānudunu virula yammulu nāḍi veyam̐ būnudu pūvula paraga nā melugāne bhāviṁchi vūraguṁdu (||||) tamaga mām̐pam̐ga lega dāgŏni jaṁkiṁchim̐ jūdu mamada to jaṁkiṁchaga mari sŏladu vumuru vĕnnĕlagum̐gā kuhiṁtu ninnum̐baigŏna bhramasi nīve ne nani bhāviṁchi vūraguṁdu (||||) kovila kūdalagum̐gā kūsuṁdu nī tŏḍamīm̐da kāvirim̐ gūsuṁḍa kaḍu kaum̐giliṁtunu śhrī veṁkaḍeśha nannum̐ jegŏni kūḍidi viṭṭe bhāvamu lŏkkaḍigāne bhāviṁchi vūraguṁdu