Title (Indic)యెట్టు సేసినాఁ జేయనీ ఇఁకఁ దన చిత్తము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యెట్టు సేసినాఁ జేయనీ ఇఁకఁ దన చిత్తము ఇట్టిదని రమణుని కెఱిఁగించరే (॥॥) ముచ్చటెంతైనాఁ దీరచు మోహము గల వారికి మచ్చికతో సారె సారె మాట లాడినా వచ్చిరాని పద్యములె నుండు నడియాస కొచ్చి కొచ్చి యెంతేసి కొసరినాను (॥॥) తని వేమిటాఁ బొందదు తమకించేవారికి పెనఁగి పెనఁగి యెంత ప్రియపడినా వినియు వినని మాట విధమై యుండుఁ దలఁపు కనుఁ గొని యెదుటనే కాచుకుండినాను (॥॥) తగు లెంతైనాఁ బాయదు తతిఁ గూడిన వారికి నగి యెటువలె గోరు నాటించినాను తగ శ్రీ వేంకటేశుఁడు తానే వచ్చి నన్నుఁగూడె చిగురుఁ జేగై వుండు చిమ్మి రేఁచినానూ English(||pallavi||) yĕṭṭu sesinām̐ jeyanī im̐kam̐ dana sittamu iṭṭidani ramaṇuni kĕṟim̐giṁchare (||||) muchchaḍĕṁtainām̐ dīrasu mohamu gala vārigi machchigado sārĕ sārĕ māḍa lāḍinā vachchirāni padyamulĕ nuṁḍu naḍiyāsa kŏchchi kŏchchi yĕṁtesi kŏsarinānu (||||) tani vemiḍām̐ bŏṁdadu tamagiṁchevārigi pĕnam̐gi pĕnam̐gi yĕṁta priyabaḍinā viniyu vinani māḍa vidhamai yuṁḍum̐ dalam̐pu kanum̐ gŏni yĕduḍane kāsuguṁḍinānu (||||) tagu lĕṁtainām̐ bāyadu tadim̐ gūḍina vārigi nagi yĕḍuvalĕ goru nāḍiṁchinānu taga śhrī veṁkaḍeśhum̐ḍu tāne vachchi nannum̐gūḍĕ sigurum̐ jegai vuṁḍu simmi rem̐sinānū