Title (Indic)యెంత మన్నించేవు నే నీ కేమి బాఁతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యెంత మన్నించేవు నే నీ కేమి బాఁతి చింతల యే నోము నోఁచితినో తొలుతను (॥॥) నవ్వుతా నీ పాదములు నామీఁదఁ జాఁచేవు యెవ్వరిఁ బోలుదు నీ యింతులలోను వువ్విళ్ళూర నప్పటిని వొడి వట్టి పెనఁగేవు ఇవ్వల నీకును నాకు నేడ కే డంతరము (॥॥) కందువ నా చన్ను లంటి కడు సరస మాడేవు పొందుగ నీ కాలి గోరఁ బోలుదునా విందుగా నా మాటలకు వేడుక పడేవు నీవు అంది నీతో నీడు వెట్టే యంతటిదాననా (॥॥) యేలుకొని శ్రీ వేంకటేశ నీ నీడవలెఁ బోలించి నన్నుఁ బాయ వే పొద్దును నీవు మేలుదాన నని ఇట్టే మెచ్చేవు లాలించి సోలి నా గుణాలు చెప్పి చూప నే మున్నది English(||pallavi||) yĕṁta manniṁchevu ne nī kemi bām̐ti siṁtala ye nomu nom̐sidino tŏludanu (||||) navvudā nī pādamulu nāmīm̐dam̐ jām̐sevu yĕvvarim̐ boludu nī yiṁtulalonu vuvviḽḽūra nappaḍini vŏḍi vaṭṭi pĕnam̐gevu ivvala nīgunu nāgu neḍa ke ḍaṁtaramu (||||) kaṁduva nā sannu laṁṭi kaḍu sarasa māḍevu pŏṁduga nī kāli goram̐ boludunā viṁdugā nā māḍalagu veḍuga paḍevu nīvu aṁdi nīdo nīḍu vĕṭṭe yaṁtaḍidānanā (||||) yelugŏni śhrī veṁkaḍeśha nī nīḍavalĕm̐ boliṁchi nannum̐ bāya ve pŏddunu nīvu meludāna nani iṭṭe mĕchchevu lāliṁchi soli nā guṇālu sĕppi sūba ne munnadi