Title (Indic)యేమిటికే చెలులాల యెవ్వరి నేమనేనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యేమిటికే చెలులాల యెవ్వరి నేమనేనే నా మగఁడే దయ సేసి నన్ను నేలీఁ గాక (॥॥) చిత్తజుని దూర నేల చిలుకలఁ దిట్ట నేల యిత్తల నా మనసే యింత సేయఁగా కొత్త చంద్రుఁడేమి సేసు కోవిల కేడ నేరమి హత్తిన నా కోరికలే ఆరడి సేయఁగను (॥॥) చల్లగాలి ననే దేమి చందనముతోఁ బనేమి పల్లదపు నా వలుపే పరచఁగాను చిల్లర విరులు మేలే చెఱకు విల్లు మంచిదే వెల్లివిరై నాయాసలే వెనుకొనఁగాను (॥॥) మెఱుఁగుతోఁ బోరవద్దు మేఘము జంకించవద్దు చిఱుత నా జవ్వనమే చిమ్మిరేఁచఁగా యెఱిఁగి శ్రీ వేంకటేశుఁడింతలోనే వచ్చి కూడె మఱి చింత లేదు నా జన్మ మీడేరఁగాను English(||pallavi||) yemiḍige sĕlulāla yĕvvari nemanene nā magam̐ḍe daya sesi nannu nelīm̐ gāga (||||) sittajuni dūra nela silugalam̐ diṭṭa nela yittala nā manase yiṁta seyam̐gā kŏtta saṁdrum̐ḍemi sesu kovila keḍa nerami hattina nā korigale āraḍi seyam̐ganu (||||) sallagāli nane demi saṁdanamudom̐ banemi palladabu nā valube parasam̐gānu sillara virulu mele sĕṟagu villu maṁchide vĕllivirai nāyāsale vĕnugŏnam̐gānu (||||) mĕṟum̐gudom̐ boravaddu meghamu jaṁkiṁchavaddu siṟuda nā javvaname simmirem̐sam̐gā yĕṟim̐gi śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone vachchi kūḍĕ maṟi siṁta ledu nā janma mīḍeram̐gānu