Title (Indic)యేమయ్యా ఆపె మీఁద నింత బత్తి గలిగితేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యేమయ్యా ఆపె మీఁద నింత బత్తి గలిగితేను కామించి పెండ్లాడరాదా కాదనేరా నిన్నును (॥॥) పలచఁ గా నవ్వు నవ్వి పాపట దువ్వుకొంటా కొలువు సేసే యాపెఁ గోరి చూచేవు వలిదపయ్యదలోని వట్రువ గుబ్బలమీఁద కలువ పువ్వులు వేసి కాంతాళించేవూ (॥॥) వీడెపు సెలవి తోడ వీఁగి సిగ్గువడుకొంటా కూడి మాడి వున్నయాపెఁ గొంగు వట్టేవు జాడతోడ నిట్టే మేని చక్కఁదనాలకు మెచ్చి చేడెలతోఁ బొగడుతాఁ జెలరేఁగేవూ (॥॥) యింతుల సన్నలు సేసి యేకతము లాడుకొంటా చెంత నున్నయాపె మీఁదఁ జేయివేసేవూ యింతలోనే శ్రీ వేంకటేశ మమ్ము నేలితివి పొంత నీ చెలి కౌఁగిట భోగించేవూ English(||pallavi||) yemayyā ābĕ mīm̐da niṁta batti galigidenu kāmiṁchi pĕṁḍlāḍarādā kādanerā ninnunu (||||) palasam̐ gā navvu navvi pābaḍa duvvugŏṁṭā kŏluvu sese yābĕm̐ gori sūsevu validabayyadaloni vaṭruva gubbalamīm̐da kaluva puvvulu vesi kāṁtāḽiṁchevū (||||) vīḍĕbu sĕlavi toḍa vīm̐gi sigguvaḍugŏṁṭā kūḍi māḍi vunnayābĕm̐ gŏṁgu vaṭṭevu jāḍadoḍa niṭṭe meni sakkam̐danālagu mĕchchi seḍĕladom̐ bŏgaḍudām̐ jĕlarem̐gevū (||||) yiṁtula sannalu sesi yegadamu lāḍugŏṁṭā sĕṁta nunnayābĕ mīm̐dam̐ jeyivesevū yiṁtalone śhrī veṁkaḍeśha mammu nelidivi pŏṁta nī sĕli kaum̐giḍa bhogiṁchevū