Title (Indic)విచారించుకోవుగాక వేడుకకాఁడవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విచారించుకోవుగాక వేడుకకాఁడవు నీవు పచారించఁ బోతేను నీపై నిట్టె మోవదా (॥విచా॥) సొలసి మాటలాడేటి సుదతిని విభుఁడవు పలుకులలో నెగ్గులు పట్టఁదగునా వలపించితి వాకెను వద్దనుండనినేరమి నెలకొని వెదకితే నీ వొళ్లిదే కాదా (॥విచా॥) కొసరి చేతులు చాఁచే కోమలిచేఁతలకుఁగా యెసఁగ వాసులువంతు లెంచవచ్చునా వెసఁ బెండ్లాడితి వేవేల కోర్వకుండితే అసుదుగా నిన్నె దూరి అందరూను నాడరా (॥విచా॥) కందువ నిన్నుఁగూడిన కాంతను శ్రీ వేంకటేశ పొందుల రతులయలపులు చూతురా సందడిఁ బెనఁగితివి సారె మెచ్చకమానితే కిందటి పనులకు నీకె దయవుట్టదా English(||pallavi||) visāriṁchugovugāga veḍugagām̐ḍavu nīvu pasāriṁcham̐ bodenu nībai niṭṭĕ movadā (||visā||) sŏlasi māḍalāḍeḍi sudadini vibhum̐ḍavu palugulalo nĕggulu paṭṭam̐dagunā valabiṁchidi vāgĕnu vaddanuṁḍaninerami nĕlagŏni vĕdagide nī vŏḽlide kādā (||visā||) kŏsari sedulu sām̐se komalisem̐talagum̐gā yĕsam̐ga vāsuluvaṁtu lĕṁchavachchunā vĕsam̐ bĕṁḍlāḍidi vevela korvaguṁḍide asudugā ninnĕ dūri aṁdarūnu nāḍarā (||visā||) kaṁduva ninnum̐gūḍina kāṁtanu śhrī veṁkaḍeśha pŏṁdula radulayalabulu sūdurā saṁdaḍim̐ bĕnam̐gidivi sārĕ mĕchchagamānide kiṁdaḍi panulagu nīgĕ dayavuṭṭadā