Title (Indic)విన్న కన్న వారికెల్లా వెరగయ్యీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విన్న కన్న వారికెల్లా వెరగయ్యీని చిన్నదాన వెంతేసిచేఁతలు సేసేవే (॥విన్న॥) చిన్నిచిన్నినగవులు సెలవులఁ జిందుకొంటా సన్నపుటెలుఁగులను సాదించుకొంటా కిన్నెరమీఁటులు మీఁటి గిలిగించుకొంటాను ఇన్నేసివిధాలఁ బతి నెంత యెలయించేవే (॥విన్న॥) పాఁగినగుబ్బలు సారె పయ్యదను మూసుకొంటా మాఁగినమోవి చూపి మలసుకొంటా కాఁగెఁడేసిపిరుఁదులఁ గడుమురుసుకొంటాను వీఁగ కితనిముందర వేసా లెంతసేసేవే (॥విన్న॥) చేరఁడేసికన్నులను చెలరేఁగి చూచుకొంటా కూరిమి మాటలలోనే కొసరుకొంటా యీరీతి శ్రీవేంకటేశు నింత సేసి కూడితిని మేరతో నన్నితఁ డేలె మేకు లేమిచూపేవే English(||pallavi||) vinna kanna vārigĕllā vĕragayyīni sinnadāna vĕṁtesisem̐talu seseve (||vinna||) sinnisinninagavulu sĕlavulam̐ jiṁdugŏṁṭā sannabuḍĕlum̐gulanu sādiṁchugŏṁṭā kinnĕramīm̐ṭulu mīm̐ṭi giligiṁchugŏṁṭānu innesividhālam̐ badi nĕṁta yĕlayiṁcheve (||vinna||) pām̐ginagubbalu sārĕ payyadanu mūsugŏṁṭā mām̐ginamovi sūbi malasugŏṁṭā kām̐gĕm̐ḍesibirum̐dulam̐ gaḍumurusugŏṁṭānu vīm̐ga kidanimuṁdara vesā lĕṁtaseseve (||vinna||) seram̐ḍesigannulanu sĕlarem̐gi sūsugŏṁṭā kūrimi māḍalalone kŏsarugŏṁṭā yīrīdi śhrīveṁkaḍeśhu niṁta sesi kūḍidini merado nannidam̐ ḍelĕ megu lemisūbeve