Title (Indic)విచ్చలవిడై మీరు వినోదింతురుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విచ్చలవిడై మీరు వినోదింతురుగాక హెచ్చెను తమకములు ఇఁకనేల జాగులు (॥విచ్చ॥) వేవేగ రమ్మనుచు వెలఁది లేకలు వ్రాసి పావురము మెడఁగట్టి పంపె నీకను నీవది చదువుకొని నెమ్మిఁ బతికమ్మ వెట్టి యీవేళనే అంపితివి ఇఁకనేల జాగులు (॥విచ్చ॥) కలికి నీరాకకుఁ గాచుకవుందాననని చిలుకచే విన్నపాలు చెప్పిపంపెను మలసి నీవని విని మారుత్తరములు నేర్పి యెలమితో నంపితివి ఇఁకనేల జాగులు (॥విచ్చ॥) దతి యలమేల్మంగ చూపులు నీ కెదురంపె యెదుటనే నిలిచితి వింతలో నీవు కదిసి పెండ్లాడితివి గక్కన శ్రీవేంకటేశ యిదె కంటి మిందరము ఇకఁనేల జాగులు English(||pallavi||) vichchalaviḍai mīru vinodiṁturugāga hĕchchĕnu tamagamulu im̐kanela jāgulu (||vichcha||) vevega rammanusu vĕlam̐di legalu vrāsi pāvuramu mĕḍam̐gaṭṭi paṁpĕ nīganu nīvadi saduvugŏni nĕmmim̐ badigamma vĕṭṭi yīveḽane aṁpidivi im̐kanela jāgulu (||vichcha||) kaligi nīrāgagum̐ gāsugavuṁdānanani silugase vinnabālu sĕppibaṁpĕnu malasi nīvani vini māruttaramulu nerbi yĕlamido naṁpidivi im̐kanela jāgulu (||vichcha||) dadi yalamelmaṁga sūbulu nī kĕduraṁpĕ yĕduḍane nilisidi viṁtalo nīvu kadisi pĕṁḍlāḍidivi gakkana śhrīveṁkaḍeśha yidĕ kaṁṭi miṁdaramu igam̐nela jāgulu