Title (Indic)వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను (॥వెన్న॥) కన్నులు మిన్నులు దాఁకీ కాయ మీడ వున్నఁగానే తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల యిన్నిటి కొడయఁడవై యిందిరేశ నీవు నాలో నున్నరూపు గానలేను వూహించి ఇపుడు (॥వెన్న॥) కాయము పాయము గీరీ కాల మీడ నుండఁగానే ఆయపు మనసు ముంచీ నన్నిటియందు యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో (॥వెన్న॥) ఇహమే పరము గోరీ యీడ నిట్టె వుండఁగాను మహిలో శ్రీవేంకటేశ మహిమెట్టిదో అహరహమును నీ వంతర్యామివై సహజమై యుండఁ గంటి చాలు నిఁక నాకు English(||pallavi||) vĕnna sedam̐baṭṭi neyi vĕdaginaṭṭu yĕnnam̐ga nīvuṁḍam̐gānu yĕkkaḍo sūsenu (||vĕnna||) kannulu minnulu dām̐kī kāya mīḍa vunnam̐gāne tinnani vīnulu mĕṭṭī dikkulanĕlla yinniḍi kŏḍayam̐ḍavai yiṁdireśha nīvu nālo nunnarūbu gānalenu vūhiṁchi ibuḍu (||vĕnna||) kāyamu pāyamu gīrī kāla mīḍa nuṁḍam̐gāne āyabu manasu muṁchī nanniḍiyaṁdu yeyĕḍa nālonunna yīśhvara nī nilayamu pāyaguṁḍam̐ goralenu pāyamu nāgĕṭṭido (||vĕnna||) ihame paramu gorī yīḍa niṭṭĕ vuṁḍam̐gānu mahilo śhrīveṁkaḍeśha mahimĕṭṭido aharahamunu nī vaṁtaryāmivai sahajamai yuṁḍam̐ gaṁṭi sālu nim̐ka nāgu