Title (Indic)వెనకటివలె నిఁక వేసరేనా నీతో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెనకటివలె నిఁక వేసరేనా నీతో అనువుగా నీ చెప్పినట్లు సేసేమయ్యా (॥వెన॥) మానినులఅలుకలు మాటలాడుదాఁకానే నానినచలములెల్లా నవ్వుదాఁకానే యేనెపము లేదు మమ్ము నెంతేసి వేఁడుకొనేవు ఆనుకొని నీచెప్పినట్లు సేసేమయ్యా (॥వెన॥) సిగ్గులు గక్కన నీవు చేయి చాఁచినందాఁకానే యెగ్గులు మంతనమున నెనయుదాఁక వొగ్గుచు మమ్మిందుకుఁగా వూరడించే వింతేసి అగ్గలము నీచెప్పినట్టు సేసేమయ్యా (॥వెన॥) కడమ లేమిగల్లానుకన్నుల జూచుదాఁకానే జడియుటెట్లా మేలుచల్లుదాఁకానే కడిఁగి శ్రీవేంకటేశ కలసితి వింతేసి అడరి నీవు చెప్పినట్టే సేసేమయ్యా English(||pallavi||) vĕnagaḍivalĕ nim̐ka vesarenā nīdo anuvugā nī sĕppinaṭlu sesemayyā (||vĕna||) māninulaalugalu māḍalāḍudām̐kāne nāninasalamulĕllā navvudām̐kāne yenĕbamu ledu mammu nĕṁtesi vem̐ḍugŏnevu ānugŏni nīsĕppinaṭlu sesemayyā (||vĕna||) siggulu gakkana nīvu seyi sām̐sinaṁdām̐kāne yĕggulu maṁtanamuna nĕnayudām̐ka vŏggusu mammiṁdugum̐gā vūraḍiṁche viṁtesi aggalamu nīsĕppinaṭṭu sesemayyā (||vĕna||) kaḍama lemigallānugannula jūsudām̐kāne jaḍiyuḍĕṭlā melusalludām̐kāne kaḍim̐gi śhrīveṁkaḍeśha kalasidi viṁtesi aḍari nīvu sĕppinaṭṭe sesemayyā