Title (Indic)వెంగెము సేయదు సుమ్మీ వెలఁది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెంగెము సేయదు సుమ్మీ వెలఁది అంగవించి తెలిసితే నంతా నీపై మోహము (॥వెంగె॥) చిందేటి నీ మేనిమీఁది చెమటలు వొడగని గందవొడి వుత్తెంచె కలికినీకు కందువలఁ దిరిగాడి కడు దప్పిగొంటివని పొందుగాఁ బన్నీరు చెంబు వుత్తెంచె నీకు (॥వెంగె॥) తిద్దుకో కస్తూరిబొట్టు తీరుగా నొసలనని అద్దమిదె వుత్తెంచె నంగన నీకు నిద్దురకన్నులకుఁ బూనినతేట లుప్పతిల్లు పొద్దునఁ బచ్చకప్రము వుత్తెంచె నీకు (॥వెంగె॥) ఆవేళఁ గూడి యలపులార ముడుచుకొమ్మని సేవంతులు వుత్తెంచె చెలియ నీకు భావింప నలమేల్మంగపతివి శ్రీవేంకటేశ పోవుల పెండ్లివిడేలు వుత్తెంచె నీకు English(||pallavi||) vĕṁgĕmu seyadu summī vĕlam̐di aṁgaviṁchi tĕliside naṁtā nībai mohamu (||vĕṁgĕ||) siṁdeḍi nī menimīm̐di sĕmaḍalu vŏḍagani gaṁdavŏḍi vuttĕṁchĕ kaliginīgu kaṁduvalam̐ dirigāḍi kaḍu dappigŏṁṭivani pŏṁdugām̐ bannīru sĕṁbu vuttĕṁchĕ nīgu (||vĕṁgĕ||) tiddugo kastūribŏṭṭu tīrugā nŏsalanani addamidĕ vuttĕṁchĕ naṁgana nīgu nidduragannulagum̐ būninadeḍa luppadillu pŏddunam̐ bachchagapramu vuttĕṁchĕ nīgu (||vĕṁgĕ||) āveḽam̐ gūḍi yalabulāra muḍusugŏmmani sevaṁtulu vuttĕṁchĕ sĕliya nīgu bhāviṁpa nalamelmaṁgabadivi śhrīveṁkaḍeśha povula pĕṁḍliviḍelu vuttĕṁchĕ nīgu