Title (Indic)వెలయఁ జేపట్టితివి విడువరా దిఁక నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెలయఁ జేపట్టితివి విడువరా దిఁక నీకు బలువుఁడవు గనక పంతమిదే సుమ్మీ (॥వెల॥) మన్నించితి విన్నిటాను మచ్చికలు సేసితివి వన్నెల నీకృప యిఁక వదలకుమీ పిన్నదాన నెఱఁగను ప్రియములు చెప్పేను యిన్నిటా బుద్దులు చెప్పి యేలుకొమ్మీ నన్నును (॥వెల॥) వలపించితివి నన్ను వాసితో నిలిపితివి చెలిమి యిట్టె నడపఁ జిత్తగించుమీ పలుకు లంతేసి నేర పదివేలకును మొక్కే కలకాలమును కీర్తిగద్దుసుమ్మీ నీకును (॥వెల॥) చనవిచ్చితివి నాతో సరసము లాడితివి మనవి చేకొని నన్ను మఱవకుమీ యెనసితివి శ్రీవేంకటేశ నిన్నుఁ బొగడేను దినము సంతోసము లందిచుమీ వేడుకను English(||pallavi||) vĕlayam̐ jebaṭṭidivi viḍuvarā dim̐ka nīgu baluvum̐ḍavu ganaga paṁtamide summī (||vĕla||) manniṁchidi vinniḍānu machchigalu sesidivi vannĕla nīkṛpa yim̐ka vadalagumī pinnadāna nĕṟam̐ganu priyamulu sĕppenu yinniḍā buddulu sĕppi yelugŏmmī nannunu (||vĕla||) valabiṁchidivi nannu vāsido nilibidivi sĕlimi yiṭṭĕ naḍabam̐ jittagiṁchumī palugu laṁtesi nera padivelagunu mŏkke kalagālamunu kīrdigaddusummī nīgunu (||vĕla||) sanavichchidivi nādo sarasamu lāḍidivi manavi segŏni nannu maṟavagumī yĕnasidivi śhrīveṁkaḍeśha ninnum̐ bŏgaḍenu dinamu saṁtosamu laṁdisumī veḍuganu