Title (Indic)వేడు కిది దాఁచరాదు వెల్లవిరిఁ జేయరాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేడు కిది దాఁచరాదు వెల్లవిరిఁ జేయరాదు కూడిన తారుకాణలు గుట్టుతోనే వున్నవి (॥వేడు॥) ఆడుకోలుమాఁట గద్దు ఆతనికి నాకును తోడితేవే విన్నవించే తోడనే నేను జోడిం చొకరితోఁ జెప్పేసుద్దులు గావు జాడతో నే నెరుఁగుదు సరిఁ దా నెరుఁగును (॥వేడు॥) సేసిన గురుతు గద్దు చేరి మా యిద్దరికి రాసికెక్కఁ జూచెను రమ్మనఁగదె మూసిమంతనములైన మొరఁగులవి ఆసల నాయందు నున్నవా తనందు నున్నవి (॥వేడు॥) యేకతపు పొందు గద్దు యిద్దరికిని జోకతో శ్రీవేంకటేశుఁ జూపఁగదవే మాకె తెలుసు నలమేలుమంగను నేను యీకడ నా మగఁ డీతఁ డీతని దేవులను English(||pallavi||) veḍu kidi dām̐sarādu vĕllavirim̐ jeyarādu kūḍina tārugāṇalu guṭṭudone vunnavi (||veḍu||) āḍugolumām̐ṭa gaddu ādanigi nāgunu toḍideve vinnaviṁche toḍane nenu joḍiṁ sŏgaridom̐ jĕppesuddulu gāvu jāḍado ne nĕrum̐gudu sarim̐ dā nĕrum̐gunu (||veḍu||) sesina gurudu gaddu seri mā yiddarigi rāsigĕkkam̐ jūsĕnu rammanam̐gadĕ mūsimaṁtanamulaina mŏram̐gulavi āsala nāyaṁdu nunnavā tanaṁdu nunnavi (||veḍu||) yegadabu pŏṁdu gaddu yiddarigini jogado śhrīveṁkaḍeśhum̐ jūbam̐gadave māgĕ tĕlusu nalamelumaṁganu nenu yīgaḍa nā magam̐ ḍīdam̐ ḍīdani devulanu