Title (Indic)వేఱే నేమూరకుండిన వెంగెమే కాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేఱే నేమూరకుండిన వెంగెమే కాదా నీఱుపైఁ గోపాలు చూప నీయంతవారమా (॥వేఱే॥) కొంగువట్టి నిన్నుఁ బేరుకొననైతినని దూరే వెంగిలి నోరఁ బిలిచేదెగ్గు గాదా కుంగని కుచాలు దాఁచుకొంటినంట నాడేవు నింగిమోవఁ బెరుగఁగ నీ యంతవారమా (॥వేఱే॥) అంచ నీవొద్దఁ గూచుండనని యలిగేవు నీ మంచము కాళ్ళఁ దొక్కేది మదము గాదా అంచు మోవనోరఁగఁగ ఆనుకోనైతిననేవు నించిన కొండలు మోవ నీయంతవారమా (॥వేఱే॥) అమర నీతోఁ బెనఁగనైతినంటా గొణగేవు చెమటమెయి నీపైమోవ సిబ్బితి గాదా తమితో శ్రీ వేంకటేశ దక్కి నన్నుఁ గూడితివి నెమకిప్రేమఁ గూడఁగ నీయంతవారమా English(||pallavi||) veṟe nemūraguṁḍina vĕṁgĕme kādā nīṟubaim̐ gobālu sūba nīyaṁtavāramā (||veṟe||) kŏṁguvaṭṭi ninnum̐ berugŏnanaidinani dūre vĕṁgili noram̐ bilisedĕggu gādā kuṁgani kusālu dām̐sugŏṁṭinaṁṭa nāḍevu niṁgimovam̐ bĕrugam̐ga nī yaṁtavāramā (||veṟe||) aṁcha nīvŏddam̐ gūsuṁḍanani yaligevu nī maṁchamu kāḽḽam̐ dŏkkedi madamu gādā aṁchu movanoram̐gam̐ga ānugonaidinanevu niṁchina kŏṁḍalu mova nīyaṁtavāramā (||veṟe||) amara nīdom̐ bĕnam̐ganaidinaṁṭā gŏṇagevu sĕmaḍamĕyi nībaimova sibbidi gādā tamido śhrī veṁkaḍeśha dakki nannum̐ gūḍidivi nĕmagipremam̐ gūḍam̐ga nīyaṁtavāramā