Title (Indic)వరుస దప్పిన మీఁద వాదులేలిఁక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వరుస దప్పిన మీఁద వాదులేలిఁక సరవి నడిపితేను సమ్మతించేఁ గాక (॥వరు॥) కోపగించ నిఁకనేలే కొంకుదేరినవెనక వోపి తనయిల్లాలనై వుండుటగాక రాపు సేయ నిఁకనేలే రాజసమే చూపఁగాను చేపట్టి వూడిగాలు నేఁ జేయు టింతేకాక (॥వరు॥) జంకించ నిఁకనేలే చలివాసిన వెనక మంకుతోఁ బుస్తెగట్టుక మనుటగాక అంకించి పిలువనేలే అటుమోమైన వెనక కంకియై తనరాకకుఁ గాచుకుండదుఁ గాక (॥వరు॥) పచ్చిసేయ నిఁక నేలే పంతమిచ్చిన వెనక మెచ్చి తనకాఁగిట నే మెరతుఁగాక అచ్చపు శ్రీవేంకటేశుఁ డంగవించి కూడె నన్ను యెచ్చుఁగుందు లిఁకనేలే యెఱఁగనైతిఁగాక English(||pallavi||) varusa dappina mīm̐da vādulelim̐ka saravi naḍibidenu sammadiṁchem̐ gāga (||varu||) kobagiṁcha nim̐kanele kŏṁkuderinavĕnaga vobi tanayillālanai vuṁḍuḍagāga rābu seya nim̐kanele rājasame sūbam̐gānu sebaṭṭi vūḍigālu nem̐ jeyu ṭiṁtegāga (||varu||) jaṁkiṁcha nim̐kanele salivāsina vĕnaga maṁkudom̐ bustĕgaṭṭuga manuḍagāga aṁkiṁchi piluvanele aḍumomaina vĕnaga kaṁkiyai tanarāgagum̐ gāsuguṁḍadum̐ gāga (||varu||) pachchiseya nim̐ka nele paṁtamichchina vĕnaga mĕchchi tanagām̐giḍa ne mĕradum̐gāga achchabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁgaviṁchi kūḍĕ nannu yĕchchum̐guṁdu lim̐kanele yĕṟam̐ganaidim̐gāga