Title (Indic)వద్దనుండే చెనులతో వట్టిబీరము లేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వద్దనుండే చెనులతో వట్టిబీరము లేఁటికి పొద్దువోని జంకెనలు బొమ్మలలో నున్నవి (॥వద్ద॥) మొనలుచూపకువే ముంచిననీచన్నులు కొనలు సాగీ యాతనిగోరు వాఁడి పెనఁగితే మీరిద్దరు బిరుదుల దొడ్డవారు తనువులు సోఁకితేనే తారుకాణ వచ్చునే (॥వద్ద॥) కాటుకకన్నులనేల కారములు చల్లేవే తేటమాటల నాతనితిట్లున్నవి యీటుతో నీసరసాన నిద్దరును దొడ్డవారే కూటములలోనే మీగురుతులయ్యీనే (॥వద్ద॥) కందువకాఁగిటనేల ఘాతలెల్లాఁ జూపేవే అందుకు శ్రీవేంకటేశుఁ డాణికాఁడు పొందితిరి మీరిద్దరు భోగముల దొడ్డవారే సందడి జాణతనా చవివుట్టీనే English(||pallavi||) vaddanuṁḍe sĕnulado vaṭṭibīramu lem̐ṭigi pŏdduvoni jaṁkĕnalu bŏmmalalo nunnavi (||vadda||) mŏnalusūbaguve muṁchinanīsannulu kŏnalu sāgī yādanigoru vām̐ḍi pĕnam̐gide mīriddaru birudula dŏḍḍavāru tanuvulu som̐kidene tārugāṇa vachchune (||vadda||) kāḍugagannulanela kāramulu salleve teḍamāḍala nādanidiṭlunnavi yīḍudo nīsarasāna niddarunu dŏḍḍavāre kūḍamulalone mīgurudulayyīne (||vadda||) kaṁduvagām̐giḍanela ghādalĕllām̐ jūbeve aṁdugu śhrīveṁkaḍeśhum̐ ḍāṇigām̐ḍu pŏṁdidiri mīriddaru bhogamula dŏḍḍavāre saṁdaḍi jāṇadanā savivuṭṭīne