Title (Indic)వారివారి వోజ లింతే వద్దన నేలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారివారి వోజ లింతే వద్దన నేలే తేరకత్తెలతో నెల్లా దీకొనఁగ నేఁటికే (॥వారి॥) పలుచుఁ దనమువారు పెనఁగులాడఁ జూతురు బలిమి గలుగువారు నచారింతురు చలపాదివారైతే సాదించ వత్తురు వలపు గలితేఁ జాలు వాసు లెంచ నేఁటికే (॥వారి॥) వేసరినవారు కడు వెరగువడి వుందురు దోస మెరఁగనివారు దూరుదురు యీసున నుండేవారు యెగ్గులెల్లాఁ బట్టుదురు సేస వెట్టిన వెనక సిగ్గువడ నేఁటికే (॥వారి॥) సరస మాడేవారు చనవులు మెరతురు మరిగినవారు మర్మ మంటుదురు యిరవై శ్రీవేంకటేశుఁ డిదె నన్నుఁ గూడినాఁడు దొరసెఁ బనులు సవతుల గొడ వేఁటికే English(||pallavi||) vārivāri voja liṁte vaddana nele teragattĕlado nĕllā dīgŏnam̐ga nem̐ṭige (||vāri||) palusum̐ danamuvāru pĕnam̐gulāḍam̐ jūduru balimi galuguvāru nasāriṁturu salabādivāraide sādiṁcha vatturu valabu galidem̐ jālu vāsu lĕṁcha nem̐ṭige (||vāri||) vesarinavāru kaḍu vĕraguvaḍi vuṁduru dosa mĕram̐ganivāru dūruduru yīsuna nuṁḍevāru yĕggulĕllām̐ baṭṭuduru sesa vĕṭṭina vĕnaga sigguvaḍa nem̐ṭige (||vāri||) sarasa māḍevāru sanavulu mĕraduru mariginavāru marma maṁṭuduru yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannum̐ gūḍinām̐ḍu dŏrasĕm̐ banulu savadula gŏḍa vem̐ṭige