Title (Indic)వారిదే పో జన్మము వడి నిన్నుఁ దెచ్చిరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారిదే పో జన్మము వడి నిన్నుఁ దెచ్చిరి భారతరామాయణాలై పరగె నీకథలు (॥వారి॥) భువిమీఁద రావణుఁడు పుట్టగాఁగా రాముఁడవై తవిలి యిందరికిఁ బ్రత్యక్షమైతివి వివరింప నంతవాఁడు వెలసితేఁగా నీవు అవతార మందితే నిన్నందరునుఁ జూతురు (॥వారి॥) రమణఁ గంసాది యసురలు లూటి సేయఁగాఁగా తమిఁ గృష్ణావతార మిందరి కైతివి గములై యంతటివారు గలిగితేఁగా నీవు నేఁడు అమర జనించి మాటలాడుదు విందరితో (॥వారి॥) యెంత వుపకారియో హిరణ్యకశిపుఁడు చెంత నరసింహుఁడ నీసేవ యిచ్చెను యింతట శ్రీవేంకటేశ యిన్ని రూపులును నీవే పంతాన నీశరణని బ్రదికితి మిదివో English(||pallavi||) vāride po janmamu vaḍi ninnum̐ dĕchchiri bhāradarāmāyaṇālai paragĕ nīgathalu (||vāri||) bhuvimīm̐da rāvaṇum̐ḍu puṭṭagām̐gā rāmum̐ḍavai tavili yiṁdarigim̐ bratyakṣhamaidivi vivariṁpa naṁtavām̐ḍu vĕlasidem̐gā nīvu avadāra maṁdide ninnaṁdarunum̐ jūduru (||vāri||) ramaṇam̐ gaṁsādi yasuralu lūḍi seyam̐gām̐gā tamim̐ gṛṣhṇāvadāra miṁdari kaidivi gamulai yaṁtaḍivāru galigidem̐gā nīvu nem̐ḍu amara janiṁchi māḍalāḍudu viṁdarido (||vāri||) yĕṁta vubagāriyo hiraṇyagaśhibum̐ḍu sĕṁta narasiṁhum̐ḍa nīseva yichchĕnu yiṁtaḍa śhrīveṁkaḍeśha yinni rūbulunu nīve paṁtāna nīśharaṇani bradigidi midivo