Title (Indic)వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల ధీరతతో నేది మేలో తెలుసుకోరో (॥వారి॥) అట్టే కొందరు మతము లన్నియు నేకమని పట్టవర్ధనము నెత్తిఁ బెట్టి చూపిరి జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని- పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి (॥వారి॥) కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని అంది వట్టి లలాటశూన్యము చూపిరి కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి (॥వారి॥) చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు అలమేలుమంగపతియై యున్నవాఁడు యిలవీర నీదాసుల కిట్టి భాగ్యరేఖలు వలసినవారికెల్లా వ్రాసినాఁడితఁడు English(||pallavi||) vāri vāri bhāgyamulu vrāsi vunnavi nŏsaḽla dhīradado nedi melo tĕlusugoro (||vāri||) aṭṭe kŏṁdaru madamu lanniyu negamani paṭṭavardhanamu nĕttim̐ bĕṭṭi sūbiri jaṭṭim̐ gŏṁdaru jīvulu jaṁgame liṁgamugāni- puṭṭugĕllā bhasmamani pūsuga sūbiri (||vāri||) kŏṁda remiyunu ledu kŏṭṭam̐gŏna layamani aṁdi vaṭṭi lalāḍaśhūnyamu sūbiri kaṁduvam̐ gŏṁdaru lakṣhmīgāṁtum̐ ḍaṁtarātmayani muṁde nāmamu śhrīsūrṇamunum̐ bĕṭṭi sūbiri (||vāri||) sĕlam̐gi diṣhṭa mibuḍu śhrīveṁkaḍeśhum̐ḍu alamelumaṁgabadiyai yunnavām̐ḍu yilavīra nīdāsula kiṭṭi bhāgyarekhalu valasinavārigĕllā vrāsinām̐ḍidam̐ḍu