Title (Indic)వానికి ముదుల యిచ్చి వద్దని మానుపవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వానికి ముదుల యిచ్చి వద్దని మానుపవే శ్రీనారాయణ వీనిచేత నే వేసరితి (॥వాని॥) నీకల్పితములే యీనిఖిలేంద్రియములు యీకడ నీయింద్రియాల నెట్టు గెలువఁగవచ్చు నీకడ నిన్నే కొలిచి నీయప్పణ దెచ్చి వానిఁ బైకొని చోఁపుటగాక బలిమా రాచాజ్ఞతో (॥వాని॥) నీపంపునఁ గప్పిన నిజమైన మాయ యిది మాపాటివారెల్లా మహి నెట్టు దాఁటవచ్చు మీపాదాలే కొల్చి మీయనుజ్ఞ గొని దాని పైపైఁ దోయుటగాక బలిమా రాచాజ్ఞతో (॥వాని॥) శ్రీవేంకటేశ నీచిక్కులే యీపుట్టుగులు నీవు సేసే చేఁతలకు నే నెట్టు దొలఁగవచ్చు నీవొద్ద శరణంటి నీయానతినే వాని భావించి తోసితిఁగాక బలిమా రాచాజ్ఞతో English(||pallavi||) vānigi mudula yichchi vaddani mānubave śhrīnārāyaṇa vīniseda ne vesaridi (||vāni||) nīgalbidamule yīnikhileṁdriyamulu yīgaḍa nīyiṁdriyāla nĕṭṭu gĕluvam̐gavachchu nīgaḍa ninne kŏlisi nīyappaṇa dĕchchi vānim̐ baigŏni som̐puḍagāga balimā rāsājñado (||vāni||) nībaṁpunam̐ gappina nijamaina māya yidi mābāḍivārĕllā mahi nĕṭṭu dām̐ṭavachchu mībādāle kŏlsi mīyanujña gŏni dāni paibaim̐ doyuḍagāga balimā rāsājñado (||vāni||) śhrīveṁkaḍeśha nīsikkule yībuṭṭugulu nīvu sese sem̐talagu ne nĕṭṭu dŏlam̐gavachchu nīvŏdda śharaṇaṁṭi nīyānadine vāni bhāviṁchi tosidim̐gāga balimā rāsājñado