Title (Indic)వాఁడు నాకు నిక్కముగా వలచినను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడు నాకు నిక్కముగా వలచినను నేఁడు వచ్చి బంటువలె నిలుచుండుమనవే (॥వాఁడు॥) సిగ్గు గొంత పరులపై చింతగొంత తనకు యెగ్గు గొంత నామీఁదనేఁటివలుపే అగ్గలమై తానేలే అన్నిలోకములును తగ్గనీక నాకునిట్టే దక్కఁగ నిమ్మనవే (॥వాఁడు॥) బొంకు గొంత సత్యములు పొందు గొంత తనకు యింకా మానఁడు నాపైనేఁటివలుపే సంకెలేక వెంటవెంట సటలెల్ల విడిచి కొంకక నాయందలము గొలిచి రమ్మనవే (॥వాఁడు॥) రచ్చగొంత రాఁపుగొంత రాజసము దనకు యెచ్చుగొంత కుందుగొంత నేఁటి వలుపే వెచ్చనై కౌఁగిటఁ గూడె వేంకటేశ్వరుఁడు మచ్చిక నిట్టెయాకు మడిచి యిమ్మనవే English(||pallavi||) vām̐ḍu nāgu nikkamugā valasinanu nem̐ḍu vachchi baṁṭuvalĕ nilusuṁḍumanave (||vām̐ḍu||) siggu gŏṁta parulabai siṁtagŏṁta tanagu yĕggu gŏṁta nāmīm̐danem̐ṭivalube aggalamai tānele annilogamulunu tagganīga nāguniṭṭe dakkam̐ga nimmanave (||vām̐ḍu||) bŏṁku gŏṁta satyamulu pŏṁdu gŏṁta tanagu yiṁkā mānam̐ḍu nābainem̐ṭivalube saṁkĕlega vĕṁṭavĕṁṭa saḍalĕlla viḍisi kŏṁkaga nāyaṁdalamu gŏlisi rammanave (||vām̐ḍu||) rachchagŏṁta rām̐pugŏṁta rājasamu danagu yĕchchugŏṁta kuṁdugŏṁta nem̐ṭi valube vĕchchanai kaum̐giḍam̐ gūḍĕ veṁkaḍeśhvarum̐ḍu machchiga niṭṭĕyāgu maḍisi yimmanave