Title (Indic)వాఁడిగో దగ్గరి వచ్చె వద్దే యింత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడిగో దగ్గరి వచ్చె వద్దే యింత ఆఁడుదాన వెదురేఁగి యందము గైకొనవే (॥॥) యీతఁడు విచ్చేయుటేడ ఇంతేసి మాట లేడ రాతిరెల్లా నీవు నిద్రవోతివో పోవో చేతికి లోనైనవేళఁ జేతురా యింత యగడు యేతవ లెత్తాడఁ బతి నిల్లాలికిఁ జెల్లునా (॥॥) నిన్నతఁడు చూచుటెంత నీవు తలవంచు టెంత కన్నెకోప మెంత మూఁట గట్టుకొంటివో మన్నించ వచ్చినవేళ మగవానిఁ బరతురా తిన్నని పంతాలు చూప దేవులకుఁ జెల్లునా (॥॥) మగఁ డాడ వుండనేల మంచాన నీ వుండనేల బిగువే నీకు వెన్నెతోఁ బెట్టిరో యేమో నగుతా శ్రీ వేంకటాద్రి నాథుడు గూడెఁ గమ్మటి జగడాలు రాణివాసములకుఁ జెల్లునా English(||pallavi||) vām̐ḍigo daggari vachchĕ vadde yiṁta ām̐ḍudāna vĕdurem̐gi yaṁdamu gaigŏnave (||||) yīdam̐ḍu vichcheyuḍeḍa iṁtesi māḍa leḍa rādirĕllā nīvu nidravodivo povo sedigi lonainaveḽam̐ jedurā yiṁta yagaḍu yedava lĕttāḍam̐ badi nillāligim̐ jĕllunā (||||) ninnadam̐ḍu sūsuḍĕṁta nīvu talavaṁchu ṭĕṁta kannĕgoba mĕṁta mūm̐ṭa gaṭṭugŏṁṭivo manniṁcha vachchinaveḽa magavānim̐ baradurā tinnani paṁtālu sūba devulagum̐ jĕllunā (||||) magam̐ ḍāḍa vuṁḍanela maṁchāna nī vuṁḍanela biguve nīgu vĕnnĕdom̐ bĕṭṭiro yemo nagudā śhrī veṁkaḍādri nāthuḍu gūḍĕm̐ gammaḍi jagaḍālu rāṇivāsamulagum̐ jĕllunā