Title (Indic)వాఁడె వేంకటేశుఁడనేవాఁడె వీఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడె వేంకటేశుఁడనేవాఁడె వీఁడు వాఁడి చుట్టుఁగైదువ వలచేతివాఁడు (॥వాడె॥) కారిమారసుతుని చక్కని మాటలకుఁ జొక్కి చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు తీరని వేడుకతో తిరుమంగయాళువారి ఆరడి ముచ్చిమి కూటి కాసపడ్డవాఁడు (॥వాడె॥) పెరియాళువారి బిడ్డ పిసికి పైవేసిన విరుల దండల మెడవేసినవాఁడు తరుణి చేయి వేసిన దగ్గరి బుజము చూఁచి పరవశమై చొక్కి పాయలేని వాఁడు (॥వాడె॥) పామరులఁ దనమీద పాటలెల్లాఁ బాడుమంటా భూమికెల్లా నోర నూరి పోసినవాఁడు మామకూఁతురలమేలుమంగ నాచారియుఁ దాను గీముగానే వేంకటగిరి నుండేవాఁడు English(||pallavi||) vām̐ḍĕ veṁkaḍeśhum̐ḍanevām̐ḍĕ vīm̐ḍu vām̐ḍi suṭṭum̐gaiduva valasedivām̐ḍu (||vāḍĕ||) kārimārasuduni sakkani māḍalagum̐ jŏkki sūragā vedālaguṭṭu sūbinavām̐ḍu tīrani veḍugado tirumaṁgayāḽuvāri āraḍi muchchimi kūḍi kāsabaḍḍavām̐ḍu (||vāḍĕ||) pĕriyāḽuvāri biḍḍa pisigi paivesina virula daṁḍala mĕḍavesinavām̐ḍu taruṇi seyi vesina daggari bujamu sūm̐si paravaśhamai sŏkki pāyaleni vām̐ḍu (||vāḍĕ||) pāmarulam̐ danamīda pāḍalĕllām̐ bāḍumaṁṭā bhūmigĕllā nora nūri posinavām̐ḍu māmagūm̐turalamelumaṁga nāsāriyum̐ dānu gīmugāne veṁkaḍagiri nuṁḍevām̐ḍu