Title (Indic)వాఁడె వేంకటాద్రిమీఁద పరదైవము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడె వేంకటాద్రిమీఁద పరదైవము పోఁడిమితోఁ బొడచూపెఁ బొడవైన దైవము (॥వాడె॥) వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు పిక్కటిల్ల వెలుఁగొందే పెను దైవము పక్కినను తనలోని పదునాలుగు లోకాలు తొక్కి పాదానఁ గొలచే దొడ్డ దైవము (॥వాడె॥) వేద శాస్త్రాలు నుతించి వేసరి కానఁగలేని మోదపు పెక్కుగుణాల మూలదైవము పోది దేవతలనెల్లఁ బుట్టించ రక్షించ ఆదికారణంబైన అజుఁగన్న దైవము (॥వాడె॥) సరుస శంఖచక్రాలు సరిఁబట్టి యసురల తరగి పడవేసిన దండి దయివమూ సిరి వురమున నించి శ్రీవేంకటేశుండయి శరణాగతులఁగాచే సతమయిన దయివము English(||pallavi||) vām̐ḍĕ veṁkaḍādrimīm̐da paradaivamu pom̐ḍimidom̐ bŏḍasūbĕm̐ bŏḍavaina daivamu (||vāḍĕ||) vŏkkŏkka romagūbāna nŏgi brahmāṁḍagoṭlu pikkaḍilla vĕlum̐gŏṁde pĕnu daivamu pakkinanu tanaloni padunālugu logālu tŏkki pādānam̐ gŏlase dŏḍḍa daivamu (||vāḍĕ||) veda śhāstrālu nudiṁchi vesari kānam̐galeni modabu pĕkkuguṇāla mūladaivamu podi devadalanĕllam̐ buṭṭiṁcha rakṣhiṁcha ādigāraṇaṁbaina ajum̐ganna daivamu (||vāḍĕ||) sarusa śhaṁkhasakrālu sarim̐baṭṭi yasurala taragi paḍavesina daṁḍi dayivamū siri vuramuna niṁchi śhrīveṁkaḍeśhuṁḍayi śharaṇāgadulam̐gāse sadamayina dayivamu