Title (Indic)వాకిలి గాచుకొనివుండే వనితలము నేమెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిలి గాచుకొనివుండే వనితలము నేమెల్లా చేకొని వేళయైతేఁ జెప్పేము గాని (॥॥) మేడలో దేవులుఁ దాము మెరసి మాటలాడేరు వేడుకతో సవతులు వినఁబోకురే కూడిమాడి నవ్వుకుంటాఁ గూచున్నాడు నాయకుఁడు చూడకురే యీదిక్కు సుదతులాల (॥॥) పానుపుపైనుండి వారే బాగాలు వేసుకునేరు కానుక లిచ్చేమంటా దగ్గరఁ బోకురే ఆనుక పూవుల వేట్లాడేదు కొప్పులు జార పానిపట్టి రొదసేసి పరాకు సేయకురే (॥॥) లలి శ్రీవేంకటేశుఁ డలమేల్మంగాఁ గూడున్నారు బలిమితో లోనికు గొబ్బనఁ బోకురే పిలిచే రదివో మిమ్ముఁ బ్రియములతోఁ దామే సలిగె గల వారలు సందడించకురే English(||pallavi||) vāgili gāsugŏnivuṁḍe vanidalamu nemĕllā segŏni veḽayaidem̐ jĕppemu gāni (||||) meḍalo devulum̐ dāmu mĕrasi māḍalāḍeru veḍugado savadulu vinam̐bogure kūḍimāḍi navvuguṁṭām̐ gūsunnāḍu nāyagum̐ḍu sūḍagure yīdikku sudadulāla (||||) pānububainuṁḍi vāre bāgālu vesuguneru kānuga lichchemaṁṭā daggaram̐ bogure ānuga pūvula veṭlāḍedu kŏppulu jāra pānibaṭṭi rŏdasesi parāgu seyagure (||||) lali śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgām̐ gūḍunnāru balimido lonigu gŏbbanam̐ bogure pilise radivo mimmum̐ briyamuladom̐ dāme saligĕ gala vāralu saṁdaḍiṁchagure