Title (Indic)వాకిటి కప్పటనుండి వచ్చివున్నదాన నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిటి కప్పటనుండి వచ్చివున్నదాన నేను కాకుసేయ కాతని నిక్కడికి నంపఁగదే (॥వాకి॥) చెంతల నాతని నొంటిఁ జిక్కించుక యేమేమో మంతనములాడేవేమే మాపుదాఁకాను వింతగా నాతనిచేత వీణె వాయింపించుకొంటా యెంతభ్రమలఁబెట్టేవే ఇంటిలోనను (॥వాకి॥) పచ్చడము గప్పుకొని పతిపక్కఁబండుండి యిచ్చకా లేమిసేసేవే యెందాఁకాను పచ్చిగా నెటిపెటిని బాగా లొత్తియిచ్చుకొంటా మచ్చిక లెంతచూపెవే మఱఁగునను (॥వాకి॥) ప్రేమమున లోలోనె పెనఁగులాడుకొంటాను వేమారు నేమి నవ్వేరే వేగుదాఁకాను ఆముక శ్రీవేంకటేశుఁడంతలోనే నన్ను నెలె యేమే నన్ను మెచ్చేవే యిందుకుఁగాను English(||pallavi||) vāgiḍi kappaḍanuṁḍi vachchivunnadāna nenu kāguseya kādani nikkaḍigi naṁpam̐gade (||vāgi||) sĕṁtala nādani nŏṁṭim̐ jikkiṁchuga yememo maṁtanamulāḍeveme mābudām̐kānu viṁtagā nādaniseda vīṇĕ vāyiṁpiṁchugŏṁṭā yĕṁtabhramalam̐bĕṭṭeve iṁṭilonanu (||vāgi||) pachchaḍamu gappugŏni padibakkam̐baṁḍuṁḍi yichchagā lemiseseve yĕṁdām̐kānu pachchigā nĕḍibĕḍini bāgā lŏttiyichchugŏṁṭā machchiga lĕṁtasūbĕve maṟam̐gunanu (||vāgi||) premamuna lolonĕ pĕnam̐gulāḍugŏṁṭānu vemāru nemi navvere vegudām̐kānu āmuga śhrīveṁkaḍeśhum̐ḍaṁtalone nannu nĕlĕ yeme nannu mĕchcheve yiṁdugum̐gānu