Title (Indic)వాకిట వచ్చివున్నాఁడు వాఁడివో నీ రమణుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిట వచ్చివున్నాఁడు వాఁడివో నీ రమణుఁడు చేకొని వుపచారాలు చెప్పవలదటవే (॥వాకి॥) పొంతనే చుట్టరికాన పొందులు చేసినవారు యెంతైనా యెగ్గులుఁ దప్పు లెంతురటవే చింతదీర మాఁటపట్టుచేసుకొన్న యట్టివారు వింతవా రేమిచెప్పినా విననేర్తురటవే (॥వాకి॥) వొనరఁగఁ బ్రాణములు వొక్కటైవుండినవారు తనివోనిముచ్చటలు దాఁతురటవే చనవున రతికి నాసలఁబొరలేటివారు పెనఁగక సిగ్గులెల్లాఁ బెంతురటవే (॥వాకి॥) విచ్చనవిడిని తాము వేడుకపడినవారు కొచ్చికొచ్చి గుట్టునఁ గొంకుదురటవే అచ్చపుశ్రీవేంకటేశుఁ డలమేల్మగవునీవు తచ్చి కూడితిరి నవ్వఁదగవులౌనటవే English(||pallavi||) vāgiḍa vachchivunnām̐ḍu vām̐ḍivo nī ramaṇum̐ḍu segŏni vubasārālu sĕppavaladaḍave (||vāgi||) pŏṁtane suṭṭarigāna pŏṁdulu sesinavāru yĕṁtainā yĕggulum̐ dappu lĕṁturaḍave siṁtadīra mām̐ṭabaṭṭusesugŏnna yaṭṭivāru viṁtavā remisĕppinā vinanerduraḍave (||vāgi||) vŏnaram̐gam̐ brāṇamulu vŏkkaḍaivuṁḍinavāru tanivonimuchchaḍalu dām̐turaḍave sanavuna radigi nāsalam̐bŏraleḍivāru pĕnam̐gaga siggulĕllām̐ bĕṁturaḍave (||vāgi||) vichchanaviḍini tāmu veḍugabaḍinavāru kŏchchigŏchchi guṭṭunam̐ gŏṁkuduraḍave achchabuśhrīveṁkaḍeśhum̐ ḍalamelmagavunīvu tachchi kūḍidiri navvam̐dagavulaunaḍave