Title (Indic)వాకిట నుండే యేమి యడిగేవు వలవని సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిట నుండే యేమి యడిగేవు వలవని సుద్దులు యేకతమాయను యింటిలోనికి యేలుదువు రావయ్యా (॥వాకి॥) మగువవూసిన కుంకుమ దుమ్ములో మలసి సాములుసేసినఁగాక పగటుతో చనుసంగడాలెత్తుచు బలిమి చూపినఁగాక తగిలి జంకెనబొమ్మలవిండ్లఁ దాఁగఁగఁగురులు యేసినఁగాక నిగిడి యాపెనేరుపు లూరక నీకు నింతలోఁ దెలుసునా (॥వాకి॥) సుదతి జవ్వనగరిడికి నెక్కి సొరిది దాళాలు దొక్కినఁగాక పెదవిమీఁదట గంటిదాఁకుదాఁకఁ బెనఁగినఁగాక గుదికొన నీకెసింగారపుమేనిగోఁత మురమునమోచినఁగాక వుదుటున నీపె జాణతనములు వూరకె నీకుఁదెలుసునా (॥వాకి॥) ఇందుముఖి నిట్టె లాలించే మొక్కుల నెక్కు డుదండాలు దోసినఁగాక పొందిపొంది జగజెట్టిరతులనుఁ బొరలినఁగాక కందువ శ్రీవేంకటేశ మీరిద్దరు కాఁగిట నిట్టె గెలిచినఁగాక చెందిన యాకె సేవలలోపలిచేఁత లూరకె తెలుసునా English(||pallavi||) vāgiḍa nuṁḍe yemi yaḍigevu valavani suddulu yegadamāyanu yiṁṭilonigi yeluduvu rāvayyā (||vāgi||) maguvavūsina kuṁkuma dummulo malasi sāmulusesinam̐gāga pagaḍudo sanusaṁgaḍālĕttusu balimi sūbinam̐gāga tagili jaṁkĕnabŏmmalaviṁḍlam̐ dām̐gam̐gam̐gurulu yesinam̐gāga nigiḍi yābĕnerubu lūraga nīgu niṁtalom̐ dĕlusunā (||vāgi||) sudadi javvanagariḍigi nĕkki sŏridi dāḽālu dŏkkinam̐gāga pĕdavimīm̐daḍa gaṁṭidām̐kudām̐kam̐ bĕnam̐ginam̐gāga gudigŏna nīgĕsiṁgārabumenigom̐ta muramunamosinam̐gāga vuduḍuna nībĕ jāṇadanamulu vūragĕ nīgum̐dĕlusunā (||vāgi||) iṁdumukhi niṭṭĕ lāliṁche mŏkkula nĕkku ḍudaṁḍālu dosinam̐gāga pŏṁdibŏṁdi jagajĕṭṭiradulanum̐ bŏralinam̐gāga kaṁduva śhrīveṁkaḍeśha mīriddaru kām̐giḍa niṭṭĕ gĕlisinam̐gāga sĕṁdina yāgĕ sevalalobalisem̐ta lūragĕ tĕlusunā