Title (Indic)వాకిట నీవుండనేల వనిత లోన నుండగ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాకిట నీవుండనేల వనిత లోన నుండగ సాకిరివారము నేము సాదించ వచ్చేమా (॥వాకిట॥) పంతము నీతో నాడి పలుక కున్నది చెలి యెంత సేసితివో నీవే యెరుఁగుదువు మంతుకు మాతోఁ జెప్పెంపేమాటలు పనికిరావు అంతే కలితే విచ్చేసి ఆదరించు నీవే (॥వాకిట॥) వొడఁబాటు వొప్పగించి వొంటినే వున్నది చెలి అడరి నీవే నేరుతు వంతటికిని చిడుముడి నే మొక్కటి సేసేటితతి దప్పె వెడఁగా పె చిత్తము రా వేడుకొమ్మి నీవే (॥వాకిట॥) భారము నీ మీద బెట్టి పవ్వ ళించున్నది చెలి చేరువాయఁ బనులు నీచేతిదే యిఁక యీరీతి నా పెను గూడి యిట్టె ముంగిటఁ గూచుంటి పేర శ్రీవేంకటేశ పిలుచుకో నీవే English(||pallavi||) vāgiḍa nīvuṁḍanela vanida lona nuṁḍaga sāgirivāramu nemu sādiṁcha vachchemā (||vāgiḍa||) paṁtamu nīdo nāḍi paluga kunnadi sĕli yĕṁta sesidivo nīve yĕrum̐guduvu maṁtugu mādom̐ jĕppĕṁpemāḍalu panigirāvu aṁte kalide vichchesi ādariṁchu nīve (||vāgiḍa||) vŏḍam̐bāḍu vŏppagiṁchi vŏṁṭine vunnadi sĕli aḍari nīve nerudu vaṁtaḍigini siḍumuḍi ne mŏkkaḍi seseḍidadi dappĕ vĕḍam̐gā pĕ sittamu rā veḍugŏmmi nīve (||vāgiḍa||) bhāramu nī mīda bĕṭṭi pavva ḽiṁchunnadi sĕli seruvāyam̐ banulu nīsedide yim̐ka yīrīdi nā pĕnu gūḍi yiṭṭĕ muṁgiḍam̐ gūsuṁṭi pera śhrīveṁkaḍeśha pilusugo nīve