Title (Indic)వాదులేల చదువులు వారు చెప్పినవే కావా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాదులేల చదువులు వారు చెప్పినవే కావా వాదులేల మీమాట వారికంటే నెక్కుడా (॥వాదు॥) నాలుగువేదాల బ్రహ్మ నలి నెవ్వనిసుతుఁడు వాలిన పురాణాలవ్యాసుఁ డెవ్వనిదాఁసుడు లీల రామాయణపు వాల్మీకివసిష్ఠులు ఆలకిం చెవ్వనిఁ గొల్చి రాతఁడే పో దేవుఁడు (॥వాదు॥) భారత మెవ్వనికథ భాగవతము చెప్పిన- ధీరుఁడైన శుకుఁడు యేదేవుని కింకరుఁడు సారపుశాస్త్రాలు చూచి సన్యసించి నుడిగేటి- నారాయణనామపు నాథుఁడే పో దేవుఁ డు (॥వాదు॥) విష్ణునాజ్ఞయని చెప్పే విధిసంకల్ప మేడది విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది “విష్ణుమయం సర్వ “ మనే వేదవాక్య మెవ్వనిది విష్ణువు శ్రీవేంకటాద్రివిభుఁడే ఆదేవుఁడు English(||pallavi||) vādulela saduvulu vāru sĕppinave kāvā vādulela mīmāḍa vārigaṁṭe nĕkkuḍā (||vādu||) nāluguvedāla brahma nali nĕvvanisudum̐ḍu vālina purāṇālavyāsum̐ ḍĕvvanidām̐suḍu līla rāmāyaṇabu vālmīgivasiṣhṭhulu ālagiṁ sĕvvanim̐ gŏlsi rādam̐ḍe po devum̐ḍu (||vādu||) bhārada mĕvvanigatha bhāgavadamu sĕppina- dhīrum̐ḍaina śhugum̐ḍu yedevuni kiṁkarum̐ḍu sārabuśhāstrālu sūsi sanyasiṁchi nuḍigeḍi- nārāyaṇanāmabu nāthum̐ḍe po devum̐ ḍu (||vādu||) viṣhṇunājñayani sĕppe vidhisaṁkalba meḍadi viṣhṇumāyayani sĕppe viśhvamaṁtā nĕvvanidi “viṣhṇumayaṁ sarva “ mane vedavākya mĕvvanidi viṣhṇuvu śhrīveṁkaḍādrivibhum̐ḍe ādevum̐ḍu