Title (Indic)వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా (॥వాద॥) అరయ జీవులకెల్లా నభేదమైతే గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము సొరిది నాతుమలోన సోహంభావనయైతే సరి మునుల దేవపూజలు చెల్లవు (॥వాద॥) సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే బహుయాగాది కర్మాల పస లేదు మహిలోని జననాలు మరణాలు మాయమైతే విహితాచారాలు సేయ విధే లేదు (॥వాద॥) ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప యిటు పురుషసూక్తాదు లివి మరేల అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే సటలాడుకొనేడి రాక్షసమత మవును English(||pallavi||) vādamela sārĕsārĕ vaḍi mukti ledaṁṭā vedāṁtaśhravaṇamu vĕṭṭigim̐ jesirā (||vāda||) araya jīvulagĕllā nabhedamaide gurum̐ḍu śhiṣhyulu lem̐ḍu kūḍa dardhamu sŏridi nādumalona sohaṁbhāvanayaide sari munula devabūjalu sĕllavu (||vāda||) sahajalīlāvibhūdi sarvamu mithya yaide bahuyāgādi karmāla pasa ledu mahiloni jananālu maraṇālu māyamaide vihidāsārālu seya vidhe ledu (||vāda||) ghaḍana brahmamu nirāgāra maidem̐ baṭhiyiṁpa yiḍu puruṣhasūktādu livi marela aḍu śhrīveṁkaḍeśhudāsyamu lega bigiside saḍalāḍugŏneḍi rākṣhasamada mavunu