Title (Indic)వాదమేల సారె సారె వడి ముక్తి లేదంటె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాదమేల సారె సారె వడి ముక్తి లేదంటె వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసేరా (॥వాద॥) అరయ ప్రపంచమెల్ల నభేద మయితే గురుఁడు శిష్యుడు లేఁడు కూడ దర్థము సొరిది నాత్మలోన సోహంభావన యయితే సరి మును దేవ పూజలు చెల్లవు (॥వాద॥) సహజలీలావిభూతి సర్వం మిధ్య యయితే బహు యాగాదికర్మము పనిలేదు మహిలోని జననము మరణము మాయ యయితే విహితాచారము సేయ విధిలేదు (॥వాద॥) ఘటన బ్రహ్మము నిరాకార మయితేఁ బఠియింప యిటు పురుషసూక్తాదు లివి నీకేల అటు శ్రీ వేంకటేశు ద్యానము లేక బిగిసితే సటలాడుకొనేటి రాక్షమత మవును English(||pallavi||) vādamela sārĕ sārĕ vaḍi mukti ledaṁṭĕ vedāṁtaśhravaṇamu vĕṭṭigim̐ jeserā (||vāda||) araya prabaṁchamĕlla nabheda mayide gurum̐ḍu śhiṣhyuḍu lem̐ḍu kūḍa dardhamu sŏridi nātmalona sohaṁbhāvana yayide sari munu deva pūjalu sĕllavu (||vāda||) sahajalīlāvibhūdi sarvaṁ midhya yayide bahu yāgādigarmamu paniledu mahiloni jananamu maraṇamu māya yayide vihidāsāramu seya vidhiledu (||vāda||) ghaḍana brahmamu nirāgāra mayidem̐ baṭhiyiṁpa yiḍu puruṣhasūktādu livi nīgela aḍu śhrī veṁkaḍeśhu dyānamu lega bigiside saḍalāḍugŏneḍi rākṣhamada mavunu