Title (Indic)ఉండవయ్య ఇఁక నీవు వొబ్బుద్దితోను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండవయ్య ఇఁక నీవు వొబ్బుద్దితోను నిండుకొనె నవ్వులెల్లా నేఁడు నా సెలవుల (॥॥) బొంకక చెప్పితివిగా పొందుల నీసుద్దు లెల్లా కొంకక నామనసులో కోపము మానె అంకెల నేఁ బెట్టుమన్న ఆన వెట్టుకొంటివిగా మంకునాచలములెల్లా మట్టుపడీనిపుడు (॥॥) తగ నియ్యకొంటివిగా తారుకాణించినవెల్లా యెగసక్కెములవుడు కెంతయుఁ బాసె తగవరులు చెప్పితే తల వంచుకొంటివిగా వెగటులన్నీ నుడిగి వేడుకలాయను (॥॥) సిగ్గులువడితివిగా చేఁతలు దలపంచి వెగ్గళించిన తొల్లిటివెత దీరెను నిగ్గుల శ్రీ వేంకటేశ నీవు నన్నేలితివిగా తగ్గనిభోగముల సంతసము లీడేరేను English(||pallavi||) uṁḍavayya im̐ka nīvu vŏbbuddidonu niṁḍugŏnĕ navvulĕllā nem̐ḍu nā sĕlavula (||||) bŏṁkaga sĕppidivigā pŏṁdula nīsuddu lĕllā kŏṁkaga nāmanasulo kobamu mānĕ aṁkĕla nem̐ bĕṭṭumanna āna vĕṭṭugŏṁṭivigā maṁkunāsalamulĕllā maṭṭubaḍīnibuḍu (||||) taga niyyagŏṁṭivigā tārugāṇiṁchinavĕllā yĕgasakkĕmulavuḍu kĕṁtayum̐ bāsĕ tagavarulu sĕppide tala vaṁchugŏṁṭivigā vĕgaḍulannī nuḍigi veḍugalāyanu (||||) sigguluvaḍidivigā sem̐talu dalabaṁchi vĕggaḽiṁchina tŏlliḍivĕda dīrĕnu niggula śhrī veṁkaḍeśha nīvu nannelidivigā tagganibhogamula saṁtasamu līḍerenu