Title (Indic)ఉండరే యెక్కడి సుద్ది వొడఁబరచకురే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండరే యెక్కడి సుద్ది వొడఁబరచకురే యెండలెల్ల నీడలాయ నిద్దరికి మాకు (॥ఉండ॥) కూరిమిలేనిపొందు కొనలెటువలెసాగు పేరులేని పిలుపులు ప్రియమెట్టౌను తారుకాణించేనంటే తానాడ నేనీడ మారుత్తరమియ్యరాదు మనసులేయెరుఁగు (॥ఉండ॥) నగవురానిమేలము నయమెటువలెనౌను మొగముచూడని మొక్కు మోచేదేడ తగులఁబెట్టేనంటే తతిలేదు మితిలేదు పగటు లాడఁగరాదు పట్టినదేపంతము (॥ఉండ॥) పలచఁగానిసిగ్గులు పనికెటువలెవచ్చు చలివాయనివలపు సాదించేదెట్టు యెలమి శ్రీవెంకటేశుఁ డీడనుండె నన్నుఁగూడె వెలపరచఁగరాదు వేడుకలేనిండెను English(||pallavi||) uṁḍare yĕkkaḍi suddi vŏḍam̐barasagure yĕṁḍalĕlla nīḍalāya niddarigi māgu (||uṁḍa||) kūrimilenibŏṁdu kŏnalĕḍuvalĕsāgu peruleni pilubulu priyamĕṭṭaunu tārugāṇiṁchenaṁṭe tānāḍa nenīḍa māruttaramiyyarādu manasuleyĕrum̐gu (||uṁḍa||) nagavurānimelamu nayamĕḍuvalĕnaunu mŏgamusūḍani mŏkku mosedeḍa tagulam̐bĕṭṭenaṁṭe tadiledu midiledu pagaḍu lāḍam̐garādu paṭṭinadebaṁtamu (||uṁḍa||) palasam̐gānisiggulu panigĕḍuvalĕvachchu salivāyanivalabu sādiṁchedĕṭṭu yĕlami śhrīvĕṁkaḍeśhum̐ ḍīḍanuṁḍĕ nannum̐gūḍĕ vĕlabarasam̐garādu veḍugaleniṁḍĕnu