Title (Indic)ఉండనీవే తానెట్లనుండినాను నే నిమ్మ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండనీవే తానెట్లనుండినాను నే నిమ్మ- పండు గానుకిచ్చితేను పనులెల్లా నౌను (॥ఉండ॥) యెఱఁగనిపొందులు యెక్కడోవారికినైన జఱఁగఁ బొఁ(బొం?) దైతేనే చవివుట్టును మఱచి ముమ్మదముతో మాఁకువలె నుండినాను గుఱిగా గోరుసోఁకితే కోరికలు రేఁగును (॥ఉండ॥) అగ్గలమై యించుక మోహములేనివారికైన దగ్గరఁ గూచుండితేనే తమిరేఁగును సిగ్గువడి తలవంచి చెక్కు చేతిలో నుండిన వొగ్గి మాటలాడితేనే వొడఁబడు మనసు (॥ఉండ॥) అక్కజపువొట్లతో నటిగినవారికైన చక్కఁజూచి నవ్వితేనే సమ్మతులౌను యిక్కు వెఱిఁగి శ్రీవేంకటేశుఁడిటు నన్నుఁ గూడె మొక్కిననా మొక్కులెల్ల ముద్దులై తోఁచును English(||pallavi||) uṁḍanīve tānĕṭlanuṁḍinānu ne nimma- paṁḍu gānugichchidenu panulĕllā naunu (||uṁḍa||) yĕṟam̐ganibŏṁdulu yĕkkaḍovāriginaina jaṟam̐gam̐ bŏm̐(bŏṁ?) daidene savivuṭṭunu maṟasi mummadamudo mām̐kuvalĕ nuṁḍinānu guṟigā gorusom̐kide korigalu rem̐gunu (||uṁḍa||) aggalamai yiṁchuga mohamulenivārigaina daggaram̐ gūsuṁḍidene tamirem̐gunu sigguvaḍi talavaṁchi sĕkku sedilo nuṁḍina vŏggi māḍalāḍidene vŏḍam̐baḍu manasu (||uṁḍa||) akkajabuvŏṭlado naḍiginavārigaina sakkam̐jūsi navvidene sammadulaunu yikku vĕṟim̐gi śhrīveṁkaḍeśhum̐ḍiḍu nannum̐ gūḍĕ mŏkkinanā mŏkkulĕlla muddulai tom̐sunu