Title (Indic)ఉండనీరా యీపాటి వూరకే నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉండనీరా యీపాటి వూరకే నన్ను కొండెగోడితనాలకుఁ గోపమెల్లా వచ్చును (॥ఉండ॥) చుట్టుమవుతానెఱఁగము సూడుబంటవో యెఱఁగ మట్టె నాతో నాపె సుద్దులాడుకొనేవు ముట్టి ముట్టి నేము నీతో ముచ్చటలు చెప్పుకోఁగా యెట్టు వచ్చునో యెఱఁగమేమీనననొల్లము (॥ఉండ॥) నగవవుతా నెఱఁగము నాటకమో యెఱఁగము తగవు నన్నడిగేవాతరుణిమాట నిగిడి పోపో చాలు నిన్నునెవ్వఁడెఱుఁగును యెగసక్కీఁడవు తొల్లే యేమీనననోపము (॥ఉండ॥) నెపమవుతా నెఱఁగము నెయ్యమవుతానెఱఁగము యిపుడు వచ్చితిరి మాయింటికి మీరు అపుడె శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను చపలతఁ గూడితిని సాదించ నేనోపను English(||pallavi||) uṁḍanīrā yībāḍi vūrage nannu kŏṁḍĕgoḍidanālagum̐ gobamĕllā vachchunu (||uṁḍa||) suṭṭumavudānĕṟam̐gamu sūḍubaṁṭavo yĕṟam̐ga maṭṭĕ nādo nābĕ suddulāḍugŏnevu muṭṭi muṭṭi nemu nīdo muchchaḍalu sĕppugom̐gā yĕṭṭu vachchuno yĕṟam̐gamemīnananŏllamu (||uṁḍa||) nagavavudā nĕṟam̐gamu nāḍagamo yĕṟam̐gamu tagavu nannaḍigevādaruṇimāḍa nigiḍi pobo sālu ninnunĕvvam̐ḍĕṟum̐gunu yĕgasakkīm̐ḍavu tŏlle yemīnananobamu (||uṁḍa||) nĕbamavudā nĕṟam̐gamu nĕyyamavudānĕṟam̐gamu yibuḍu vachchidiri māyiṁṭigi mīru abuḍĕ śhrī veṁkaḍeśha alamelumaṁga nenu sabaladam̐ gūḍidini sādiṁcha nenobanu