Title (Indic)ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు మల్లాడి తా వలెనంటే మైకొనే నపుడు (॥ఉల్ల॥) మనసు నిర్మలమైతే మాట విన నింపౌను ననువు గలవారికి నవ్వ నింపౌను చనవు గలిగితేను సాదించ నింపౌను యెనయనిచోటికి నేమిటికి మాటలు (॥ఉల్ల॥) తలయెత్తి చూచితేను దండకు రా నింపౌను చెలిమి సేసితే విందు చెప్పి నింపౌను పిలువు గలిగితేను పెనఁగఁగ నింపౌను వొలిసి నొల్లమికిని వొడి వట్ట నేఁటికే (॥ఉల్ల॥) కరఁగి లోనై తేను కాఁగిలించ నింపౌను సరస మాడితే చెయి చాఁచ నింపౌను యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్నుఁగూడె తరితీపైనందుకు తామసించ నేఁటికే English(||pallavi||) ullamu galayudām̐kā vūraguṁḍuḍe melu mallāḍi tā valĕnaṁṭe maigŏne nabuḍu (||ulla||) manasu nirmalamaide māḍa vina niṁpaunu nanuvu galavārigi navva niṁpaunu sanavu galigidenu sādiṁcha niṁpaunu yĕnayanisoḍigi nemiḍigi māḍalu (||ulla||) talayĕtti sūsidenu daṁḍagu rā niṁpaunu sĕlimi seside viṁdu sĕppi niṁpaunu piluvu galigidenu pĕnam̐gam̐ga niṁpaunu vŏlisi nŏllamigini vŏḍi vaṭṭa nem̐ṭige (||ulla||) karam̐gi lonai tenu kām̐giliṁcha niṁpaunu sarasa māḍide sĕyi sām̐sa niṁpaunu yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ taridībainaṁdugu tāmasiṁcha nem̐ṭige