Title (Indic)ఉదయాద్రి తెలుపాయె నుడురాజు కొలువిడె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉదయాద్రి తెలుపాయె నుడురాజు కొలువిడె అద నెఱిఁగి రాఁడాయెనమ్మ నా విభుఁడు (॥ఉద॥) చన్నులపై ముత్యాల సరు లెల్లఁ జల్లఁనాయె కన్నులకుఁ గప్పొదవెఁ గాంత నాకిపుడు కన్నెకలువల జాతి కనుమోడ్చినది మీఁద వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె (॥ఉద॥) పువ్వుల లోపలి కురులు బుగులుకొనఁగా నెఱసె దవ్వులఁ దుమ్మెద గములు తరమి డాయఁగను రవ్వసేయశుకపికము రాయడి కోర్వఁగరాదు అవ్వల నెవ్వతెపసల కలరున్న వాఁడో (॥ఉద॥) పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి చెన్నుగం గొప్పున విరులు చెరువం దురిమి యెన్నంగల తిరువేంకటేశుం డిదె ననుం గూడె కన్నులు మనసు నుం దనియం గరుణించెం గదవే English(||pallavi||) udayādri tĕlubāyĕ nuḍurāju kŏluviḍĕ ada nĕṟim̐gi rām̐ḍāyĕnamma nā vibhum̐ḍu (||uda||) sannulabai mutyāla saru lĕllam̐ jallam̐nāyĕ kannulagum̐ gappŏdavĕm̐ gāṁta nāgibuḍu kannĕgaluvala jādi kanumoḍchinadi mīm̐da vĕnnĕla vesaṁgi mŏgga vigasiṁchĕ gadavĕ (||uda||) puvvula lobali kurulu bugulugŏnam̐gā nĕṟasĕ davvulam̐ dummĕda gamulu tarami ḍāyam̐ganu ravvaseyaśhugabigamu rāyaḍi korvam̐garādu avvala nĕvvadĕbasala kalarunna vām̐ḍo (||uda||) pannīḍa jalaga mārsi pachchagapramu mĕtti sĕnnugaṁ gŏppuna virulu sĕruvaṁ durimi yĕnnaṁgala tiruveṁkaḍeśhuṁ ḍidĕ nanuṁ gūḍĕ kannulu manasu nuṁ daniyaṁ garuṇiṁchĕṁ gadave