Title (Indic)తప్పు లెంచ నే నిన్నుఁ దరుణీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తప్పు లెంచ నే నిన్నుఁ దరుణీ యిప్పుడే చెప్పితిఁ జుమ్మీ యింతిరో నీకు (॥తప్పు॥) గంద మిచ్చి రావే చెలి కాంతునికి నింద లేమి వచ్చునో నే నోపనమ్మా అందియ్యవే విడెము నీ వాతనికి, నీ పతి చెంది తమ్మ వెట్టితే నేమందువో నీవు (॥తప్పు॥) కమ్మి వేళ చూచి రావే కలికీ నెమ్మి నాతో నవ్వు నేమో నే నోపనమ్మా రమ్మని పిలువవే దూరక చేయివట్టి అమ్మరో మేను సోఁకు నేమందువో నీవు (॥తప్పు॥) ఆముక యెదురుకోవే అదె వచ్చీని నీమారు న న్నంటునేమో నే నోపనమ్మా దోమటి శ్రీవేంకటేశుతోఁ గూడి రావే ఆమఱఁగున నుండి యేమందువో నీవు English(||pallavi||) tappu lĕṁcha ne ninnum̐ daruṇī yippuḍe sĕppidim̐ jummī yiṁtiro nīgu (||tappu||) gaṁda michchi rāve sĕli kāṁtunigi niṁda lemi vachchuno ne nobanammā aṁdiyyave viḍĕmu nī vādanigi, nī padi sĕṁdi tamma vĕṭṭide nemaṁduvo nīvu (||tappu||) kammi veḽa sūsi rāve kaligī nĕmmi nādo navvu nemo ne nobanammā rammani piluvave dūraga seyivaṭṭi ammaro menu som̐ku nemaṁduvo nīvu (||tappu||) āmuga yĕdurugove adĕ vachchīni nīmāru na nnaṁṭunemo ne nobanammā domaḍi śhrīveṁkaḍeśhudom̐ gūḍi rāve āmaṟam̐guna nuṁḍi yemaṁduvo nīvu